WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బూతులు తిట్టడంలో...'ముగ్గురూ...ముగ్గురే...!?

వాళ్లు ముగ్గురూ...'చంద్రబాబు'కు రాజకీయ ప్రత్యర్థులు...! ముగ్గురిలో ఇద్దరు...ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా...మరొకరు..ఆ కుటుంబం వద్ద ఉద్యోగి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. ముగ్గురు వ్యక్తులకు ఏక రూపత ఉంది. అదేమిటంటే...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత దూషణలు చేయడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. ఒకరు ముఖ్యమంత్రిగా ఉండి..ప్రతిపక్షనేతపై అనుచిత పదజాలంతో దూషణలకు దిగితే...మరొకరు...ప్రతిపక్ష స్థానంలో ఉండి...సిఎంపై వ్యక్తిగత దూషణలకు దిగగా...ఇంకొకరు...రాజ్యసభ సభ్యుడిగా..ఉండి... సిఎంపై అమ్మబూతులు లంకించుకున్నారు. ఈ ముగ్గురూ...చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని చేస్తోన్న విమర్శలు..సంచలనం సృష్టిస్తున్నాయి. వ్యక్తిగత రోగాలకు సంబంధించిన వ్యాఖ్యలు... తల్లి,దండ్రికి సంబంధించిన బూతులు తిట్టి....'చంద్రబాబు'పై పైచేయి సాధించాలని...ఈ ముగ్గురూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఈ ముగ్గురు ఎవరంటే...ఒకరు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వారిలో ప్రథముడి కాగా...మరొకరు...ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కాగా...ఇంకొకరు...ఆయన పార్టీకి చెందిన 'విజయసాయిరెడ్డి'లు...! వీరు ముగ్గురూ వివిధ సందర్బాల్లో 'చంద్రబాబు'పై బూతులు లంకించుకున్నారు. హుందాతనం, మర్యాద మరిచిపోయి..వీరు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి: వై.ఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో...అసెంబ్లీ చర్చల సందర్భంగా... అవినీతిపై ప్రతిపక్షనాయకుడిగా ఉన్న 'చంద్రబాబు' నిలదీస్తుంటే...అసహనంతో... వై.ఎస్‌... 'చంద్రబాబు'పై బూతులు లంకించుకున్నారు. సాక్షాత్తూ...నిండు అసెంబ్లీలోనే...ఆయన 'చంద్రబాబు' ను ఉద్దేశించి...'మీ అమ్మకడుపున నువ్వుపుట్టకపోతే...బాగుండేదేమోనని' వ్యాఖ్యానించి తన నోటి దూల తీర్చుకున్నారు. కడిగేస్తా...అంటూ ఊగిపోయారు. అప్పటి అసెంబ్లీ దృశ్యాలు...ఇప్పటికీ... యూటూబ్‌లో మారుమ్రోగిపోతూనే ఉన్నాయి. ఆవేశంతో అప్పట్లో వై.ఎస్‌.తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటారేమోనని...కొందరు ఆశించినా...వై.ఎస్‌..తన మాటలకే కట్టుబడి...తనలో వికృతాన్ని బయటపెట్టుకున్నారు.

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి: నంద్యాల ఉప ఎన్నికల సమయంలో....ప్రచారం నిర్వహిస్తూ... 'చంద్రబాబు'ను ఉరితీసినా తప్పులేదని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. చంద్రబాబు చేసిన అవినీతికి ఆయనను నడిబజారులో ఉరివేయాలని వ్యాఖ్యానించారు. అంతే కాదు...ఆయన వివిధ సందర్భాల్లో...కూడా నోరు జారారు. 'చంద్రబాబు'ను ఏకవాచకంలో సంబోధిస్తూ...చులకనగా మాట్లాడి...గౌరవాన్ని తగ్గించుకున్నారు.

విజయసాయిరెడ్డి: వై.ఎస్‌ కుటుంబానికి ఆడిటర్‌గా పనిచేస్తూ...వారి కుటుంబానికి లక్షకోట్లు దోచిపెట్టడంలో సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. వై.ఎస్‌.జగన్‌తో పాటు...జైలు జీవితం గడిపి...ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చి...రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా...ఆయన వ్యవహరిస్తూ...జగన్‌కు...మోడీకి మధ్య అనుసంధాన కర్తగా పనిచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిన్న రాజ్యసభలో 'మోడీ' కాళ్లుకు మొక్కారని టిడిపి విమర్శించడంతో...ఆయన అసహనానికి గురయి...'చంద్రబాబు'పై వ్యక్తిగత దూషణలకు దిగారు. 'ఒక అమ్మ...అయ్యకు..సక్రమంగా పుట్టిన' వారెవరూ తనపై విమర్శలు చేయరని... ఆయనలో వాఛలతను బయటపెట్టుకున్నారు. పెద్దలసభ సభ్యుడైన...ఈ మాజీ ఆడిటర్‌... హుందాతనాన్ని మరిచిపోయి...బూతులు లంకించుకుని..పరువు తీసుకున్నారు. మొత్తం మీద...ఈ ముగ్గురు వ్యక్తులు...వివిధ సందర్భాల్లో...చంద్రబాబుపై..వ్యక్తిగత బూతులు లంకించుకున్న వ్యక్తులే...!


(517)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ