లేటెస్ట్

'ఆమంచి' ఆరోపణలు చేసింది 'సాక్షి' రిపోర్టర్‌పైనే...!

ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్యాయత్నానికి గురైన 'నాగార్జునరెడ్డి'పై 'చీరాల' మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు 'ఆమంచి కృష్ణమోహన్‌' సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అసలు జర్నలిస్టే  కాదని, ఆయన గత ఎన్నికల్లో టిడిపి ఏజెంట్‌గా ఉన్నారని ఆరోపించారు. 'నాగార్జునరెడ్డి' పలువురు మహిళలను వేధించారని, ఆయనపై 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, అటువంటి వ్యక్తి జర్నలిస్టు ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. మహిళా అధికారి గురించి 'నాగార్జునరెడ్డి' అత్యంత అసభ్యకరంగా రాశారని, ఇటువంటి రాతలు రాసేవాడిని జర్నలిస్టు అంటారా..? అంటూ ఆయన విరుచుకుపడ్డారు. కాగా 'ఆమంచి' ఆరోపణలు చేసింది..స్వయానా అధికారపార్టీ పత్రికకు సంబంధించిన విలేకరిపైనే. 'ఆమంచి' ఆరోపించిన 'నాగార్జునరెడ్డి' 'సాక్షి' జర్నలిస్టుగా ఆయన గుర్తింపు కార్డు చూపిస్తోంది. ప్రస్తుతం 'నాగార్జునరెడ్డి' 'సాక్షి'లో పనిచేస్తున్నారో లేదో తెలియదు కానీ...ఆయనకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన అక్రిడిటేషన్‌ బట్టి చూస్తే..ఆయన  ప్రకాశం జిల్లా 'సాక్షి' రిపోర్టర్‌ అని తెలుస్తోంది. మరి 'ఆమంచి'కి ఆ సంగతి తెలిసే ఆయన జర్నలిస్టు కాదని ఆరోపించారా..? లేక..తెలిసే ఆరోపణలు చేశారో..? కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సదరు నాగార్జునరెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. 'జగన్‌' వెంట పాదయాత్రలో నడుస్తూ..ఆయన చేతిలో చేయి వేసి కొంత దూరం నడిచారు. 'జగన్‌' మాత్రమే కాదు..ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే 'ఆళ్ల రామకృష్ణారెడ్డి'కి సన్నిహితుడిగా పేరుంది. 'నాగార్జునరెడ్డి' రాసిన రాతలను బట్టి ఆయన జర్నలిస్టే కాదన్న 'ఆమంచి' ఆయన 'సాక్షి'లో పనిచేస్తున్న విషయం తెలియదేమో..? ఏది ఏమైనా 'ఆమంచి' 'నాగార్జునరెడ్డి' విషయంలో తీవ్ర ఇక్కట్లు గురువుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

(436)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ