WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం...!

నగరి ఎమ్మెల్యే 'రోజా' ప్రయాణిస్తున్న ఇండిగో విమానం పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తోన్న విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా టైర్‌ పేలడంతో పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. అయితే విమాన పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించి..భారీ ప్రమాదాన్ని నిలువరించగలిగారు. టైర్‌ పేలడంతోనే విమానాన్ని పైలెట్‌ అదుపులోకి తెచ్చుకోగలగడంతో...భారీ ఎత్తున్న ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారు. మొత్తం 70మంది ప్రయాణీకులు ఉన్న ఈ విమానంలో నగరి ఎమ్మెల్యే 'రోజా' కూడా ఉన్నారు. టైర్‌ పేలడంతో భారీ ఎత్తున్న మంటలు రావడంతో ఫైర్‌ ఇంజిన్‌లు హుటాహుటిన రంగప్రవేశం చేసి...మంటలను ఆర్పివేశాయి. దాదాపు గంట పాటు...ల్యాండ్‌ అయిన విమానం నుంచి ప్రయాణీకులను ఎవరినీ సిబ్బంది కిందకు దిగనీయలేదు. దీంతో...ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అసలు విమానం బయట ఏమి జరుగుతుందో తెలియక వారు తల్లడిల్లిపోయారు. గంట తరువాత ఎట్టకేలకు విమానం నుంచి ప్రయాణీకులను దిగడానికి అనుమతించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.


(268)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ