WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ప్రజారాజధాని'కి 'ప్రజలే' పెట్టుబడిదారులు...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వినూత్న ఆలోచనలతో ప్రజల ముందుకు వచ్చారు. అన్యాయంగా విడదీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి నిరంతరం శ్రమిస్తోన్న ఆయన...రాజధాని నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. ఢిల్లీ కంటే గొప్పరాజధానిని నిర్మించి ఇస్తామని మోసగించిన 'ప్రధాని మోడీ'కి బుద్ది చెప్పబోతున్నారు. గత నాలుగేళ్లుగా...కేంద్రం నిధులు ఇస్తుందేమోనని ఎదురు చూసీ...చూసీ..ఇక వారు ఇవ్వరని నిర్దారించుకున్న తరువాత... 'చంద్రబాబు' తనబాటలో తాను నడవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా... ప్రజారాజధాని 'అమరావతి' నిర్మాణానికి ప్రజల నుంచే నిధులను సేకరించాలని ఆయన భావిస్తున్నారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రజలు ఇస్తే...వారికి బ్యాంక్‌ వడ్డీ కంటే...రెండు శాతం..వడ్డీ అధికంగా చెల్లిస్తామని ఆయన చెబుతున్నారు. దీని కోసం త్వరలో బాండ్లు విడుదల చేయబోతున్నారు. రాజధాని నిర్మాణం కోసం ప్రజలు, ప్రవాసాంధ్రులు కలసి రావాలని ఆయన కోరుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములు కావాలని...నూతన రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చినట్లే...రాజధానిలో నిర్మాణాల కోసం ప్రజలు నిధులు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోకపోవడంతో...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనదైన దారిలో నిధుల సమస్యకు పరిష్కారమార్గాన్ని వెతుకుతున్నారు. 

  రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందన్న భావనతో ఉన్న ఆంధ్రులు, ప్రవాసాంధ్రులు..వాటికి అయ్యే ఖర్చును విరాళాల రూపంలో ఇస్తామని చెబుతున్నారు. సామాజికమాధ్యమాల్లో ఈ విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రం సహకరించడం లేదు కనుక..మన రాజధానిని మనమే నిర్మించుకుందామన్న భావన ఎక్కువ మంది ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రే స్వయంగా...ప్రజల సహాయం కోరడంతో...దీనిపై అనూహ్య స్పందన వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా...వివిధ దేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు...దీనిపై స్పందిస్తున్నారు. చంద్రబాబు ఆలోచన బాగుందని...ప్రజారాజధానికి ప్రజలే పెట్టుబడి పెడతారని...కేంద్రం...దయాదాక్షిణ్యాలపై 'ఆంధ్రులు' బతకడం లేదనే విషయాన్ని రాజధానిని నిర్మించి చూపిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద 'చంద్రబాబు' తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని...ప్రజా సహకారంతో...ఢిల్లీ పెద్దలకు త్వరలో ఆయన గుణపాఠం నేర్పుతారని...ఓ ఎన్‌ఆర్‌ఐ వ్యాఖ్యానించారు.


(283)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ