WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కె.ఇ' కుటుంబం కోసం 'జగన్‌'...ఆరాటం...!

డిప్యూటీ ముఖ్యమంత్రి, రెవిన్యూ,దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఇ.కృష్ణమూర్తిని  ఆయన కుటుంబ సభ్యులను వైకాపాలోకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారట వై.ఎస్‌.జగన్‌. ఇప్పటికే...కె.ఇ.కృష్ణమూర్తి కుమారుడితో...'జగన్‌'తో సంప్రదించారట. అయితే...తమ తండ్రి కె.ఇ. ఏ నిర్ణయం తీసుకుంటే...ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగిందట. కె.ఇ. కుటుంబం కోసం 'జగన్‌' ఆరాటపడడానికి అనేక కారణాలు ఉన్నాయి. సుమారు మూడు నాలుగు నియోజకవర్గాల్లో కె.ఇ. కుటుంబానికి పలుకుబడితో పాటు అనుచర వర్గం కూడా భారీగా ఉంది. 2014లో కర్నూలు జిల్లాలో మెజార్టీ సీట్లు వైకాపాకు దక్కినప్పటికీ...అప్పటి పరిస్థితులకు..ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని గుర్తించిన 'జగన్‌' ఏదో విధంగా కె.ఇ. కుటుంబాన్ని పార్టీలో చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే...కె.ఇ కుటుంబానికి ముఖ్యమైన పదవులు కట్టబెడతామని హామీలు ఇస్తున్నారట. 'జగన్‌' ఎందుకు ఆ విధంగా ఆశలు చూపిస్తున్నారు..ఎందుకు కె.ఇ. కోసం ఆయన ప్రయత్నిస్తున్నారనే వివరాల్లోకి వెళితే...ముఖ్యమంత్రి చంద్రబాబు కె.ఇని అవమానాలకు గురిచేశారని, ఆయనకు ఉన్న అధికారులను కుదించారని...దీనిపై కె.ఇ.కృష్ణమూర్తి చిందులు తొక్కుతున్నారని 'జగన్‌'కు తెలిసింది. పేరుకే డిప్యూటీ సిఎం ఆ పదవికి గుర్తింపే ఉండదు. 

  కీలకమైన రెవెన్యూశాఖలో జిల్లాల్లో తాసిల్దార్ల బదిలీలు కలెక్టర్‌ నిర్వహిస్తారు...? వారిని జిల్లాలకు బదిలీ చేయాలనే అధికారం, ఆర్డీఓ,డిఆర్‌ఒల బదిలీలు, పోస్టింగ్‌లు కొద్ది నెలల క్రితం వరకు రెవిన్యూమంత్రి పర్యవేక్షణలో ఉండేది. ఆ అధికారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంతం చేసుకోవడంతో కె.ఇ.కి ఎక్కువగా పని ఉండడం లేదు. ఆర్డీఓలు, డిఆర్‌ఒల బదిలీలు, పోస్టింగ్‌ల్లో అవకతవకలు సరిచేయాలే తప్ప...ఆ అధికారాలను ముఖ్యమంత్రి తన వద్ద పెట్టుకోవడం సరైన పద్దతి కాదని అధికారవర్గాలు కూడా అనేక సందర్బాల్లో సిఎంఒకు చెప్పడం జరిగింది. పొరుగు రాష్ట్రాల్లో ఆర్డీఓల బదిలీలు సిఎంలు చేస్తున్నారని, అందుకే సిఎం ఆ అధికారాలను తీసుకున్నారని సిఎంఒ వర్గాలు చెబుతున్నాయి. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న 'చంద్రబాబు' ఇటువంటి పనులు చేయడం పలు విమర్శలకు కారణమైంది. రెవిన్యూశాఖ బదిలీలు, పోస్టింగ్‌ల్లోనే అవినీతి జరిగిందా..? ఇంకేశాఖలో జరగలేదా..? ఇది కావాలని కెఇ కృష్ణమూర్తిని అవమానించడం కాదా..? కెఇ కూడా 1978లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కర్నూలు జడ్పీ ఛైర్మన్‌ పదవిని కూడా నిర్వహించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో భారీనీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు..కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. ఇంత అపారమైన అనుభవం ఉన్న వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రిని ఈ విధంగా అవమానించడం 'చంద్రబాబు'కు తగునా..? అని ఆ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అందుకేనేమో...'జగన్‌' కొద్ది నెలల కిందట మాట్లాడుతూ కె.ఇ వంటి సీనియర్‌ని 'చంద్రబాబు' అవమానించారని...అధికారాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని బాహాటంగా విమర్శించారు. కె.ఇ. సోదరుడుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కె.ఇ. కృష్ణమూర్తి కుటుంబం అంటే కేవలం కె.ఇ. కుమారులేనని వాదన ఉంది. ఏదో విధంగా కె.ఇ. కుమారులపై ఒత్తిడి తెచ్చి పార్టీలో చేర్చుకోవాలనే వైకాపా నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో..ఏ ఒక్కరూ చెప్పలేరు.

(బి.ఆర్‌.కె.మూర్తి)

(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ