WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'టిడిపి'లోకి 'శ్రీకాంత్‌రెడ్డి'....!

చాలా రోజుల నుంచి అనుకుంటున్న మాటే...! ఆ మధ్య అయితే...చేరిపోయారని...ఇంకాసేపట్లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ...అప్పట్లో...ఆ వార్తలు నిజం కాలేదు..కానీ..ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న చేరిక...అతి త్వరలో నిజం కాబోతోందని కడపకు చెందిన టిడిపి నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు. రాయచోటి ఎమ్మెల్యే 'శ్రీకాంత్‌రెడ్డి' టిడిపిలో చేరిక లాంఛనమేనని...ఆయన అంతా సర్దుకున్నారని..వారు అంటున్నారు. 'జగన్‌'కు చిన్ననాటి స్నేహితుడు అయిన 'శ్రీకాంత్‌రెడ్డి' రాజకీయంగా 'జగన్‌'కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. సంయమనం పాటించే నేతగా...సబ్జెక్ట్‌ ఉన్న నాయకునిగా ఆయన వైకాపాలో పేరు సంపాదించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కఠిన పదజాలం వాడకుండా...సున్నితంగా వ్యవహరిస్తారని..అందుకే ఆయనంటే...అందరికీ అభిమానమని జిల్లాకు చెందిన టిడిపి నాయకులు చెబుతున్నారు. కాగా...గత కొన్నాళ్లుగా ఆయన వైకాపాలో ఇమడలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో 'శ్రీకాంత్‌రెడ్డి' సీటు ఇవ్వకుండా పార్టీలో కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని...'జగన్‌'కు ఆ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్న ఆయన త్వరలో టిడిపి తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి.

  శ్రీకాంత్‌రెడ్డి పార్టీ వీడిపోతే...'జగన్‌' సొంత జిల్లాలో వైకాపాకు గట్టిదెబ్బతగిలినట్లే. గత ఎన్నికల్లో మొత్తం పది స్థానాలకు గానూ...తొమ్మిది స్థానాలు సాధించి తిరుగులేని మెజార్టీ సాధించిన ఆ పార్టీ...ప్రస్తుతం..గతంలో సాధించిన ఫలితాలు సాధించడం కష్టమనే చెప్పాలి. తాజాగా 'శ్రీకాంత్‌రెడ్డి' పార్టీ ఫిరాయిస్తే...వైకాపాకు గట్టిదెబ్బ తగిలినట్లే...! ఆయన బాటలో మరికొందరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' వల్లే 'శ్రీకాంత్‌రెడ్డి' పార్టీ వదలి వెళుతున్నారనే మాట ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. తన భార్య దగ్గరి బంధువులకు 'రాయచోటి' సీటు ఇప్పించుకునేందుకే...ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని..దానిలో భాగంగా...'శ్రీకాంత్‌రెడ్డి'కి ఎర్త్‌ పెడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసే...'శ్రీకాంత్‌రెడ్డి' తన దోవ తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారని...ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద..స్వంత జిల్లాలోనే పార్టీ బలహీనం అయితే...రాబోయే ఎన్నికలను 'జగన్‌' ఎదుర్కోవడం చాలా కష్టమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


(2015)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ