WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'పై ఏడుస్తోన్న 'బిజెపి' పెద్దలు...!

తమతో బంధం తెంచుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏదో విధంగా సాధించాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా ముప్పేటదాడికి వ్యూహం సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైకాపా,బిజెపి,జనసేనలను 'చంద్రబాబు'పై ఉసిగొల్పారు. అంతే కాకుండా ముగ్గురూ కలసి సమన్వయంతో...విమర్శలు, ఆరోపణలు కురిపిస్తూ...'చంద్రబాబు'ను దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే...'జగన్‌' 'చంద్రబాబు'ను ఆగర్భశత్రువుగా భావించి...విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే...అతని కంటే ఘనుడు.. ఆచంట మల్లన్న అన్న చందంగా...వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' బూతులు లంకించుకుంటున్నారు. వీరిద్దరికి తోడు...కొంత మంది మాజీ అధికారులు, మాజీ కాంగ్రెస్‌ నేతలు...జగన్‌ను అభిమానించే పాత్రికేయులు...'చంద్రబాబు'పై ధ్వజమెత్తుతున్నారు. వైకాపా నుంచి ఈ రకమైన దాడి జరుగుతుండగా...నిన్నటి దాకా టిడిపితో మంచి సంబంధాలు సాగించిన జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' ఒక్కసారిగా 'చంద్రబాబు'పై అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. వీరికి తోడు బిజెపి రాష్ట్ర నాయకులు, కేంద్రనాయకులు...కూడా తోడై విరుచుకుపడు తున్నారు. ఇంత మంది దాడి చేస్తోన్నా...'చంద్రబాబు' చలించకుండా...పోరాడుతుండడం బిజెపి పెద్దలకు మింగుడుపడడం లేదు. ఇదంతా...ఇలా ఉంటే....'చంద్రబాబు' చేస్తోన్న ప్రసంగాలు...బిజెపి పెద్దలకు చిర్రెత్తిస్తున్నాయి. ఆంధ్రాకు అన్యాయం చేసిన బిజెపికి బుద్దిచెప్పాలని...దేశవ్యాప్తంగా....ఆ పార్టీని ఓడించాలని...చంద్రబాబు ఇస్తోన్న పిలుపుతో బిజెపి ఉలిక్కిపడుతోంది.

  ముఖ్యంగా అతి త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 'చంద్రబాబు' వల్లే తమ పార్టీ ఓడిపోతుందేమోనన్న బెంగ బిజెపి పెద్దల్లో కనిపిస్తోందట. ఇప్పటికే...అక్కడ ఉన్న తెలుగువారు బిజెపికి ఓటు వేయరాదనే నిర్ణయంతో ఉండడంతో..బిజెపి నాయకులకు నిద్రపట్టడం లేదట. ఆంధ్రాకు జరిగిన అన్యాయాన్ని 'చంద్రబాబు' తెలుగువారికి అర్థం అయ్యేలా చెప్పగలిగారని...రాబోయే ఎన్నికల్లో...తెలుగువారెవరూ..బిజెపికి ఓటువేసే స్థితి కనిపించడం లేదని...బిజెపి నాయకులే చెబుతున్నారు. దాదాపు 70 నియోజకవర్గాల్లో...తెలుగువారు గెలుపుఓటములను నిర్ణయించే పరిస్థితుల్లో ఉండడంతో...బిజెపి పెద్దలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదట. దీంతో...ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తరువాత నుంచి...'చంద్రబాబు'పై వారు ఎదురుదాడి చేయటం ప్రారంభించారు. బిజెపికి అనుకూలంగా ఉంటే 'పోస్ట్‌కార్డు' అనే వెబ్‌సైట్‌ 'చంద్రబాబు'పై అక్కసు వెల్లగక్కింది. కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 'చంద్రబాబు' వెయ్యికోట్లు పంపించారని...ఆ వెబ్‌సైట్‌ తన కథనంలో పేర్కొని...చంద్రబాబుపై విమర్శలను, ఆరోపణలను ఎక్కుపెట్టింది. కేవలం వెబ్‌సైటే కాదు..బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రులు, రాష్ట్ర బిజెపి నాయకులు...ఇప్పుడు కర్ణాటకలో తమ పార్టీ ఓడిపోతే...'చంద్రబాబే' కారణమనే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే...అక్కడ బిజెపి గెలిచే ఛాన్స్‌ పెద్దగా లేదు. అందుకే ముందుగానే...బిజెపి పెద్దలు..ఓటమి భారాన్ని చంద్రబాబుపై నెట్టి పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారు.


(1526)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ