WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జెపి'ని 'పవన్‌' మోసం చేశారా...!?

'లోక్‌సత్తా' వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ఐఎఎస్‌ అధికారి 'జయప్రకాష్‌ నారాయణ' సినీనటుడు, జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' చేతిలో మోసపోయారా..? అంటే అవుననే అంటున్నారు...ఆయన సన్నిహితులు. విభజనతో...అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌కు వేలకోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతుండగా...అసలేమీ ఇవ్వలేదని రాష్ట్ర వాదించుకుంటున్న సమయంలో...'జనసేన' అధినేత 'పవన్‌' తాను నిజా..నిజాలు తేలుస్తానని ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ కమిటీలో పలువురు మేధావులు, సీనియర్‌ రాజకీయనాయకులు, మాజీ ఐఎఎస్‌ అధికారులకు చోటు కల్పించారు ఆయన. ఈ కమిటీ సమావేశ సందర్భంగా 'జయప్రకాష్‌నారాయణ'కు ఎంతో ప్రాధాన్యత కల్పించారు 'పవన్‌'. కమిటీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపి...ఎవరు చెప్పేది నిజమో..తేలుస్తానని హడావుడి చేశారు. కమిటీలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు వంటి 'చంద్రబాబు' వ్యతిరేకులు చోటు కల్పించారు. ఈ కమిటీ 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా తీర్పు చెబుతుందేమోనన్న శంక అప్పట్లో 'చంద్రబాబు' అభిమానులను వేధించింది. అయితే...కమిటీ సభ్యులు..'చంద్రబాబు' తప్పేమీ లేదని...కేంద్రం నుంచి దాదాపు 86వేలకోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని..వాటిని సాధించాలని రిపోర్టు ఇచ్చింది. దీనిపై తాను పోరాడతానని ప్రకటించిన 'పవన్‌' తరువాత దాని గురించి పట్టించుకోలేదు. సరి కదా...రాష్ట్ర ప్రభుత్వంపై దాడికి దిగారు. స్పెషల్‌ స్టేటస్‌ వస్తే..ఒరిగేదేముంది...నిధులు కావాలని...డిమాండ్‌ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో...ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. దాంతో..ఆ విషయం పక్కకుపోయింది. అయితే...తాజాగా...'జెపి'...'పవన్‌' వ్యవహారంపై ధ్వజమెత్తారు.

  తాను 'పవన్‌'ను ఎంతో నమ్మానని...ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదికతో...'పవన్‌కళ్యాణ్‌' కేంద్రంపై పోరాటం చేస్తారని తాను భావించానని..అయితే...ఆయన పోరాటం వదిలేశారని విమర్శించారు. తామెంతో కష్టపడి నివేదిక రూపొందిస్తే..దాన్ని పట్టించుకోకుండా...అమరావతిలో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'పవన్‌' ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో..తనకు తెలియదని...కానీ 'పవన్‌' వ్యవహరించిన తీరుతో తాను నిరాశకు గురయ్యాయని ఆయన చెబుతున్నారు. 'పవన్‌'ను నమ్ముకుని టైమ్‌ వృధా చేసుకున్నామని...ఆయనతో ఏమీ కాదని...తానే స్వతంత్రంగా మరో కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. దీంతో...'పవన్‌' 'జెపి'లు ఈ విషయంపై దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాగా..ఈ విషయంపై సినీవిమర్శకుడు 'కత్తిమహేష్‌' స్పందిస్తూ...'పవన్‌' ఏదీ చివరి వరకు చేయరని... ఆయనకు అంత సత్తాలేదని విమర్శలు కురిపించారు. మొత్తం మీద...ఏదో హడావుడి చేసి... 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా తీర్పు ఇద్దామని...'పవన్‌', బిజెపి పెద్దలు కూడబల్కుకుని చేసిన కుట్ర.. 'జెపి' చేధించారని...టిడిపి నాయకులు చెబుతున్నారు. 'పవన్‌'కు ముందునుంచి 'బిజెపి'తో అవగాహన ఉందని..అందుకే ప్యాక్ట్‌ఫైండింగ్‌ కమిటీ...అని ఏర్పాటు చేశారని...అసలు రాష్ట్రానికి బిజెపి ఏమి ఇచ్చిందో...ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారని..కానీ..'పవన్‌' మాత్రం కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తే...'చంద్రబాబు' దాన్ని దుర్వినియోగం చేశారనే అభిప్రాయం కల్గించడానికి ప్రయత్నించారని కానీ..ఆయన పథకం పారలేదని...అందుకే ఆ కమిటీ నివేదికను చెత్తబుట్టలో వేసి కొత్త నాటకానికి తెరతీశారని...టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా..రాష్ట్రానికి మేలు చేయాలని వచ్చిన 'జెపి'ని కూడా ఆయన మోసం చేశారని విమర్శిస్తున్నారు.


(521)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ