WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇప్పుడు ఎన్నికలు జరిగితే...టిడిపికి 121 సీట్లు....!

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధిస్తుందని కేంద్ర ఇంటిలిజెన్స్‌ సంస్థ కేంద్రానికి తెలియజేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఇంటిలిజెన్స్‌ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఈ సర్వేలో అధికార తెలుగుదేశం పార్టీ 121 సీట్లు గెలుస్తుందని తేలిందట. అత్యున్నత అధికారుల నుంచి ఈ సమాచారం బయటకు పొక్కిందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు వర్గాలను ఈ సర్వేలో భాగం చేశారని, వివిధ కులాలు, మతాలకు చెందిన వారిని కూడా సర్వేలో భాగం చేశారట. బిజెపికి టిడిపి రాంరాం..చెప్పిన తరువాత...ప్రజల మనోగతం ఎలా ఉందో ఈ సర్వేలో తేలిందట. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, అన్యాయాన్ని టిడిపి గట్టిగా ఎదుర్కొంటుందని...కేంద్రంపై  మొక్కవోని పట్టుదలతో సిఎం చంద్రబాబునాయుడు పోరాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారట. దీంతో...మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా...అధికార టిడిపికే ఓటు వేస్తామని ఎక్కువ మంది ఓటర్లు చెప్పారట.

   ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...టిడిపి 121 సీట్లు గెలుచుకుంటుందట. అదే సమయంలో ప్రతిపక్ష వైకాపా కూడా 50 సీట్ల వరకు గెలుచుకుంటుందని...తేలిందట. 'జనసేన' ఖాతా తెరుస్తుందని...ఆ పార్టీ నాలుగు సీట్లను సాధిస్తుందని సర్వే చెప్పిందట. ఇక రాష్ట్రానికి అన్యాయం చేసిన 'బిజెపి, కాంగ్రెస్‌'లకు డిపాజిట్లు రావని తేలిందట. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న పరిస్థితుల్లో...ఇప్పుడు వచ్చిన ఫలితాలు..అప్పటిదాకా కొనసాగుతాయో..లేదో తెలియదు కానీ...ప్రస్తుతం...మాత్రం అధికార టిడిపి వైపే ప్రజలున్నారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు కేంద్రానికి తేల్చి చెప్పాయట.


(944)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ