WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐఎఎస్‌ అధికారి పుస్తకాన్ని రాస్తే...ఇంటర్‌ తప్పినోడు ఆవిష్కరిస్తున్నాడట...!

ఆయనో ఐఎఎస్‌ అధికారి...! రాష్ట్రంలో కీలకమైన పదవులతో పాటు...విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...ఆయనను ఏరికోరి...ఆ పదవి అప్పగించాడు. పదవీ కాలం పూర్తి అయిన తరువాత...బ్రాహ్మణ కార్పొరేషన్‌ సంస్థను ఏర్పాటు చేసి...దానికి ఆయనను ఛైర్మన్‌గా నియమించారు. ఆయన అడిగినవన్నీ ఆగమేఘాలపై చేసినా...ఆ అధికారికి...'చంద్రబాబు' నచ్చలేదు. ఫేస్‌బుక్‌...సోషల్‌ మీడియాలో 'చంద్రబాబు'పై విషం చిమ్మాడు. ఆ విషయాన్ని టిడిపి కార్యకర్తలు వెలుగులోకి తీసుకురావడంతో... సదరు అధికారిని...'చంద్రబాబు' సాగనంపారు. ఇక అక్కడ నుంచి 'చంద్రబాబు' మరింత విషయం చిమ్ముతూ కక్ష తీర్చుకోవాలని...రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు...! చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయడం, రోజుకో ప్రెస్‌స్టేట్‌మెంట్‌ ఇవ్వడం...'చంద్రబాబు' వ్యతిరేకులను పోగేయటం...ఆయనకు హాబీగా మారిపోయాయి...మధ్య మధ్యలో ప్రజారాజధాని 'అమరావతి'పై విమర్శలు గుప్పించడం ఆయన నైజం....ఇటువంటి అధికారి...ఇప్పుడో...పుస్తకాన్ని రాశాడట...! దాని పేరిమిటో..తెలుసా....'ఎవరి రాజధాని అమరావతి'...? ఈ పుస్తకాన్ని ఈ నెల 5వ తేదీన విజయవాడలో ఆవిష్కరిస్తారట. తన ఇగోను శాంతింప చేసుకోవడానికి...ఆంధ్రులు అభిమానించే... 'రాజధాని'పై విషయం చిమ్ముతున్న ఆ మాజీ అధికారి పేరు...'ఐవైఆర్‌ కృష్ణారావు'.

  ఇప్పుడు ఈ పుస్తకం...విజయవాడలో సంచలనం సృష్టిస్తోంది. తమ రాజధానిపై హైదరాబాద్‌లో ఉండేవాళ్లు విషం చిమ్ముతున్నారని..దీని ఆవిష్కరణను అడ్డుకోవాలనే రాజధాని వాసులు భావిస్తున్నారట. కాగా...ఐవైఆర్‌ రాసిన పుస్తకంపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయి. మాజీ ఐఎఎస్‌ అధికారి పుస్తకాన్ని రాస్తే....దాన్ని...ఓ ఫోటోగ్రాఫర్‌ సమక్షంలో...ఇంటర్‌ తప్పిన 'పవన్‌' దాన్ని...ఆవిష్కరిస్తున్నారని...వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. నిన్నటి దాకా..క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న బిజెపి నేత మాణిక్యాలరావు ఈ పుస్తక ఆవిష్కరణకు ఎలా వెళతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజధాని అమరావతిపై నిర్ణయాలను క్యాబినెట్‌ తీసుకుందని..దానిలో భాగస్వామిగా ఉన్న 'మాణిక్యాలరావు'...ఈ సమావేశంలో ఏం మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. తాను తప్పు చేశానని...ఆయన బహిరంగంగా ఒప్పుకుంటారా..? లేక తనకేమీ తెలియదని..మెదలకుండా.. ఉంటారా..? ఏమో....? 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌', సిపిఎం మధు, సిపిఐ రామకృష్ణ,మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మాజీ మంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారట. మొత్తంమీద...చంద్రబాబు వ్యతిరేకులంతా...ఒకే గూటిలో చేరారని, వచ్చే ఎన్నికల్లో వీరంతా కలసిపోటీ చేస్తే..బావుంటుదని ప్రజలు అంటున్నారు.


(3304)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ