WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వెంకయ్య' వర్గానికి దిక్కెవరు...!?

టిడిపి,బిజెపి బంధం విడిపోయిన తరువాత....రాష్ట్ర బిజెపిలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇన్నాళ్లూ...బిజెపిని శాసించిన వర్గం ఇప్పుడు...దిక్కులేని స్థితిలోకి చేరుకుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎప్పటి నుంచో...బిజెపిలో ఉంటున్న ఈ వర్గం ఇప్పుడు..కొత్తగా చేరిన వారితోనూ...అంతకు ముందు తమతో విభేదించిన వారితోనూ..సఖ్యత లేక..ఇబ్బందులు పడుతోంది. తమను అనాదిగా రక్షిస్తోన్న వ్యక్తి...'ఉపరాష్ట్రపతి' పదవిలోకి వెళ్లడంతో...ఈ వర్గం ఆసరా కోసం ఎదురు చూస్తోంది. గతంలో 'వెంకయ్యనాయుడు' వర్గంలో ఉన్న వారు...ఇప్పుడు...ఏదారిలో వెళ్లాలో తెలియక సతమత మవుతున్నారు. పార్టీలో తమకు గుర్తింపు తగ్గిపోతుందేమోనన్న బెంగ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. 'వెంకయ్య' ఆశీస్సులతో...ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నిక అయిన వారు..ఇప్పుడేమి చేయాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు.

   ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విశాఖపట్నం ఎంపి హరిబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు..పలువురు ఎమ్మెల్యేలు....నాయకులు 'వెంకయ్య' ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగారు. పార్టీలో ఇప్పుడు వెంకయ్యనాయుడు లేకపోవడంతో..ఆయన ప్రత్యర్థి వర్గం..వీరిని అణిచేందుకు అన్ని మార్గాలను సిద్ధం చేసుకుంది. తాజాగా...పార్టీ అధ్యక్షునిగా 'హరిబాబు'ను తప్పించి...ఎమ్మెల్సీ వీర్రాజుకు కానీ...లేక మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కానీ అప్పగించాలని పార్టీ ఇన్‌ఛార్జి రాంమాధవ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో 'హరిబాబు'కు కేంద్ర మంత్రి పదవి రాకుండా అడ్డం పడుతున్నారనే మాటా వినిపిస్తోంది. పార్టీలో కొత్తగా రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన జివిఎల్‌ నర్సింహ్మారావు..తన వర్గాన్ని విస్తరించుకునే పనిలో పడ్డారు. దీంతో..గతంలో పార్టీలో 'వెంకయ్య' వర్గంగా గుర్తింపు పొందిన వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారిని వీరివురూ గుర్తించరని...వారి వ్యతిరేకులను వీరు ఇప్పటికే ప్రోత్సహిస్తున్నారనే చర్చ పార్టీలో సాగుతోంది. ముఖ్యంగా 'వెంకయ్య' సామాజికవర్గానికి చెందిన వారిని..అణగదొక్కడమే లక్ష్యంగా వీరు వ్యవహారాల ను నడిపిస్తున్నారని...కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కొత్త నీరు వచ్చి.. పాతనీరును వెళ్లగొట్టినట్లు...ప్రస్తుతం బిజెపిలో 'వెంకయ్య' వర్గానికి కొత్తవర్గం ఎసరుపెడుతుందనేది కాదనలేని సత్యం.


(374)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ