WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోడీ'ని ఉతికేస్తోన్న 'ఆంధ్రజ్యోతి'...!

ఈ నాలుగేళ్లల్లో....ఎవరూ చేయని సాహసం 'ఆంధ్రజ్యోతి' చేస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పేరెన్నికల పత్రికలన్నీ...'మోడీ' భజనలో తరిస్తుంటే....వాటిని కాదని...ఆంధ్రజ్యోతి...'మోడీ'ని ఉతికేస్తోంది. (కొన్నాళ్ల క్రితం దాకా..ఆంధ్రజ్యోతి కూడా అదే దారిలో ఉంది) అయితే...జాతీయ స్థాయిలో...ఏ పత్రిక కానీ...ఛానెల్‌ కానీ...ప్రచురించని...ప్రసారం చేయని...'మోడీ' వ్యక్తిత్వంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలను ప్రచురించి..ప్రసారం చేస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి...'అతడొక అపరిచితుడు'..పేరిట కథనాలను ప్రచురిస్తోంది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నర్సింహ్మారావును ఉటంకిస్తూ....ఉదయం నుంచి ప్రసారాలు ప్రారంభించింది. 'మోడీ' ఈ నాలుగేళ్లల్లో ఏమి చేశారు...? ఏమి సాధించారు..అన్న సాధారణ అంశాల జోలికి వెళ్లకుండా...ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది...? ఆయనలో ఉన్న వ్యక్తిత్వ లోపాలు..ఏమిటి...? ఆయన ఎందుకు అంత అహంకారంతో వ్యవహరిస్తారు...? ఆయన రాజకీయంగా...ఎలా ఎదిగారు..తన ఎదుగుదలకు తోడ్పడిన వారిని తరువాత ఆయనేం చేశారు..? 

  గుజరాత్‌ సిఎం అవడానికి..ఆయన తెర వెనుక చేసిందేమిటి...? టీ అమ్మే స్థాయి నుంచి ప్రధానిగా ఎలా ఎదగగలిగారు..దీనిలోని అంతర్యం ఏమిటి..? భార్య, తల్లిని ఎందుకు ఆయన పట్టించుకోరు..? మోదీ..లో బయటకు కనిపించే లక్షణాలు ఏమిటి...? అంతర్గతంగా ఆయన ఏమి ఆలోచనలు చేస్తారు...? ఆయన ఎందుకు అంత గోప్యంగా ఉంటారు..? ఎవరినీ ఆయన ఎందుకు నమ్మరు..? గోద్రా సంఘటనలను 'మోడీ' రాజకీయంగా ఎలా వాడుకున్నారు...? తన కన్నా..సీనియర్లకు ఆయన చెక్‌ ఎలా పెట్టారు..? ఆయన ఊహా ప్రపంచంలో ఊరేగుతారని...ఈ నాలుగేళ్లలో...ఆయన చేసిందేముందంటూ...ఇంకా అనేక విషయాలపై...'మోడీ'ని తళ తళలాడే సబ్బుతో...ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఉతికారేసింది....! ప్రస్తుతం మీడియా ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలోనే అత్యంత శక్తివంతుడైన ప్రధాని మోడీపై ఇటువంటి ప్రసారాలు చేయడమంటే సాహసమే...! మరి అటువంటి సాహసం చేస్తోన్న 'ఆంధ్రజ్యోతి'కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే...!

(1115)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ