WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రేపు ఢిల్లీకి 'బాబు'...ఏం జరగబోతోంది...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బిజెపితో బంధం తెంచుకున్న తరువాత...ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే ప్రథమం. కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్‌డిఎ నుంచి టిడిపి బయటకు వచ్చిన తరువాత...చేస్తోన్న తొలి ఢిల్లీ పర్యటనతో..జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రాకు అన్యాయం చేస్తోన్న బిజెపి ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం ప్రకటించడంతోనే..జాతీయ స్థాయిలో ప్రకంపనలు మొదలు అయ్యాయి. టిడిపి ఇచ్చిన అవిశ్వాసానికి...జాతీయపార్టీలు...ప్రాంతీయపార్టీలు మద్దతుగా నిలబడ్డాయి. టిడిపి అవిశ్వాసం పెట్టిన తరువాత...మమతాబెనర్జీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్‌, స్టాలిన్‌,కాంగ్రెస్‌,సిపిఎం,సిపిఐతో పాటు ఇతర పార్టీలు...పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. దీంతో...అవిశ్వాసాన్ని చర్చకు రాకుండా...స్పీకర్‌ సహాయంతో...బిజెపి ఏరోజుకు ఆరోజు...వాయిదా వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. పారిపోతున్నారని ఎద్దేవా చేసినా..బిజెపి పెద్దలు పట్టించుకోకుండా...ఏ రోజుకు ఆ రోజు..సభను వాయిదా వేసి...తప్పించుకుంటున్నారు. 

 గత పక్షం రోజుల నుంచీ ఇదే తంతు జరుగుతుండడం....పార్లమెంట్‌ సమావేశాలు ఏ నిమిషంలోనైనా...నిరవధికంగా వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తుండడంతో...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...ఢిల్లీ పర్యటనకు వెళ్లి అవిశ్వాసంపై తాడో..పేడో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఆయన ఢిల్లీ వస్తుండడంతో...జాతీయ స్థాయిలో రాజకీయ వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం చర్చకు వచ్చే విధంగా చేయాలని...తద్వారా... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని...జాతీయ స్థాయిలో ప్రజలకు తెలియచెప్పాలనే స్థిరమైన నిర్ణయంతో 'బాబు' ఢిల్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో...జాతీయస్థాయిలో ఏమి జరుగుతుందో...అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి.

మూడో ఫ్రంట్‌పై చర్చ ఉంటుందా...??

ఎన్‌డిఎ నుంచి 'చంద్రబాబు' బయటకు వచ్చిన తరువాత...జాతీయ స్థాయిలో ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది. మోడీ వ్యతిరేకులకు...ఇప్పుడు ఆయనో చిరునామాగా కనిపిస్తున్నారు. అదే సమయంలో...బిజెపి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా...ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న 'మమతాబెనర్జీ', సిపిఎం,సిపిఐ, బిఎస్పీ, ఎప్సీ వంటి పార్టీల ఆలోచనలకు ఒక మార్గం ఏర్పాటు కాబోతోందన్న మాట జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. అయితే..ప్రస్తుతం...'చంద్రబాబు'  మూడో ఫ్రంట్‌ గురించి ఆలోచన చేయడం లేదని...ఆయన కేవలం సభలో అవిశ్వాసాన్ని తీసుకువచ్చేందుకే ఒత్తిడి తెస్తారని ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్‌లో అవిశ్వాసం చర్చకు వస్తే...'మోడీ'పతనం మొదలైనట్లేనని...ఆయన భావిస్తున్నారు. నమ్మించి...మోసం చేసిన 'మోడీ'ని జాతీయస్థాయిలో ఎండగట్టాలన్న ఆయన లక్ష్యం దీనితో నెరవేరుతుందని...దాంతో...'మోడీ' వ్యతిరేకులందరూ..ఒకతాటిపైకి వస్తారనే భావన ఆయనలో ఉంది. తరువాత...మూడో ఫ్రంటా...? లేక..ఇంకేదైనా...? అన్నది తేలుతుందని అంటున్నారు.

'ఖర్గే'తో 'బాబు' సమావేశం...!?

కాగా...సభలో అవిశ్వాసంపై చర్చకు వచ్చే విధంగా చేయడానికి...'చంద్రబాబు' ప్రధాన ప్రతిపక్షనేత...'మల్లిఖార్జున ఖర్గే'తో సమావేశమవుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ఇప్పటికే అవిశ్వాసంపై నోటీసు ఇచ్చిన నేపథ్యంలో...వారితో కలసి...కేంద్రంపై ఒత్తిడి తేవాలనే ఆలోచనతో 'చంద్రబాబు' ఉన్నారట. కేవలం కాంగ్రెసే కాదు..ఇతర పార్టీల నాయకులతో చర్చించి...ఏ విధంగా అవిశ్వాసాన్ని సభలో పెట్టించాలనే దానిపై ఆయన వ్యూహాలు రచించబోతున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ వద్ద ఎంపీలతో పరేడ్‌ చేయించేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఎంపీలందరూ..రాష్ట్రపతిని కలసి..విజ్ఞాపన చేస్తే...స్పీకర్‌పై ఒత్తిడి పెరుగుతుందని...అదే సమయంలో...కేంద్రంపైనా...ఒత్తిడి తీవ్రతరం అవుతుంది. దీంతో...కేంద్ర ప్రభుత్వం అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోని పరిస్థితులు కల్పించాలనేది ఆయన ఉద్దేశ్యం. అప్పటికీ కేంద్రం లొంగి రాక తప్పదని...అవిశ్వాసంపై చర్చకు ఇష్టం లేకపోతే...సభను నిరవధికంగా వాయిదా వేసుకుపోతారని...అప్పుడు కూడా తనకే లాభం చేకూరుతుందని 'చంద్రబాబు' భావిస్తున్నారు.  మొత్తం మీద...ఇప్పటికే...తనదైన వ్యూహాలతో... 'మోడీ'ని ముప్పు తిప్పలు పెడుతోన్న 'చంద్రబాబు' తాజా వ్యూహాలతో...మరింతగా...'మోడీ'ని ఇరుకునపెట్టబోతున్నారు.

(291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ