WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఐవైఆర్‌'ను ప్రభుత్వం ఎందుకు వదిలేస్తోంది....!?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై...ఆయన కుటుంబ సభ్యులపై...సిఎంఒ అధికారులపై చీటికి మాటికి అవినీతి ఆరోపణలు, విమర్శలు చేస్తోన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును ప్రభుత్వం ఎందుకు చూసీ చూడనట్లు వదిలేస్తుందనే ప్రశ్న...అధికారపార్టీ సానుభూతి పరుల్లో వ్యక్తం అవుతోంది. ఇంతకు ముందు..ఆయన సిఎంఒ కార్యాలయంపై ఆరోపణలు చేస్తూ...హైకోర్టు గడప తొక్కారు...తరువాత...నేరుగా చంద్రబాబుపై విమర్శలు కురిపించారు...ఆ తరువాత మరింత దూకుడు పెంచి...రాజధాని నిర్మాణాలపై...రైతులు ఇచ్చిన భూములపై....వరుసగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 'అమరావతి'లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని, ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరుపుతున్నారని 'ఐవైఆర్‌' ఆరోపణలు చేశారు. అయినా...ప్రభుత్వ వర్గాల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. అదే విధంగా సిఎంఒ సరిగా పనిచేయడం లేదని...అక్కడ పనిచేసే అధికారులపై ఆరోపణలు చేసినా...ప్రభుత్వం... కానీ...పార్టీ పెద్దలు కానీ స్పందించి...ఆయన విమర్శలకు సమాధానం ఇవ్వడం లేదు. దీంతో..ఆయన రోజు రోజుకీ పెట్రేగి పోతున్నారనే మాట వినిపిస్తోంది.

ఐవైఆర్‌ అక్రమాలపై ఎందుకు విచారణ చేయరు...?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్‌ నియమించక ముందు...వైకాపా గెలుస్తుందని భావించి...ఆయన దొనకొండ ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు. అన్ని వేల ఎకరాలు కొనడానికి...ఆయనకు అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది...? ఆయన వెనుక ఉన్న బినామీలు ఎవరు..? దీనిపై ముందు విచారణ చేయిస్తే..ఐవైఆర్‌ జాతకం బయటకు వస్తుంది. కానీ ప్రభుత్వం ఎందుకో దానిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తాయనే కారణంతోనే ఆయనపై విచారణకు ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. పోనీ...దానిపై విచారణ జరిపించకపోయినా...బ్రాహ్మణ కార్పొరేషన్‌లో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తే...బాగుంటుందనే టిడిపి వర్గాలు అంటున్నాయి.

1) బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారని...సాప్ట్‌వేర్‌ కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని..తన బంధువుల కంపెనీ నుంచి సాప్ట్‌వేర్‌ కొనుగోలు చేయించారని...దీనిపై విచారణ జరిపించాలని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

2) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు శిక్షణ ఇప్పించే కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయి. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించ లేదు..

3) బాపట్లలో సి.సీలకు,డీసీలకు శిక్షణ ఇప్పించారు...దీనిలో కూడా అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. కనీసం దీనిపై విచారణ జరిపించినా..ఐవైఆర్‌ బాగోతం బయటపడుతుంది.

అనైతిక కార్యక్రమాలపై దృష్టి...!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆయన అనేక అనైతిక కార్యక్రమాలు నిర్వహించారని...సచివాలయంలో ఎవరిని అడిగినా..చెబుతారు..? వాటిపై విచారణ చేయిస్తే...ఆయన బండారం బయటపడుతుంది...అయినా...ఎందుకో కానీ..ప్రభుత్వం 'ఐవైఆర్‌'ను చూసీ చూడనట్లు వదిలేస్తోంది. దీంతో...ఆయన రెచ్చిపోయి..ఆంధ్రాపై విషయం చిమ్ముతున్నారనే మాట...సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా 'ఎవరి రాజధాని అమరావతి' అనే పుస్తకాన్ని రచించి..ప్రజల్లో ఘర్షణలను రెచ్చగొట్టాలనే ప్లాన్‌ వేశారని...? దీని కోసమే...కమ్యూనిస్టులు, బిజెపి, జనసేన, వైకాపాలను కలిపి..రాజధానిపై దండెత్తిస్తున్నారని...ఇప్పటికైనా...'ఐవైఆర్‌'ను కంట్రోల్‌ చేయలేకపోతే...ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని...పార్టీ సానుభూతిపరులు, సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.


(690)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ