WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కర్ణాటక'లో 'బిజెపి'ని ఆదుకుంటున్న 'పవన్‌'...!

నెమ్మదిగానే...ముసుగు తొలగిపోతోంది. తాను అందరూ అనుకున్న మనిషిని కాదని...తనకు లోపల మరో ఏజెండా ఉందని...సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' నిరూపిస్తున్నారు. మొన్నటివరకు... ఆంధ్రా అభివృద్ధిపై...ప్రజలపై ఆయనకు ప్రేమ ఉందని...ఆంధ్రా అభివృద్ధి కోసం ఆయన ఏమైనా చేస్తారనే అభిప్రాయం సామాన్య ప్రజలతో పాటు...ఆయన అభిమానుల్లోనూ ఉండేది. కానీ... గుంటూరు సభ తరువాత...అవన్నీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాలేనని..తనకు వ్యక్తిగత లబ్దే ముఖ్యమని..రాష్ట్ర అభివృద్ధి...ఇతర విషయాల్లో తనకు పట్టింపులేదని రుజువు చేసుకున్నారు. ప్రత్యేకహోదా...ఇవ్వాల్సిన కేంద్రాన్ని ప్రశ్నించకుండా...రాష్ట్ర సిఎంపై...విమర్శలు,ఆరోపణలు కురిపించి...తన స్థాయి ఏమిటో నిరూపించుకున్నారు. అంతే కాకుండా అవసరమైతే...అవినీతి పరులతో కలసి అయినా...అధికార టిడిపిని ఓడిస్తానని శపథం చేస్తున్నారు. అంటే...తన వ్యక్తిగత లబ్దికోసం...స్వార్థం కోసం...ఇతరుల చేతిలో పావుగా మారడానికి...తానుసిద్ధంగా ఉన్నానని 'పవన్‌' నిరూపించుకున్నారు.

    తాజాగా...ఆయన తన స్వార్థం కోసం...తాను రహస్యంగా పనిచేసే వారి కోసం...వారిని ఆదుకోవడం కోసం కర్ణాటక ఎన్నికల్లో ప్రచారానికి వెళుతున్నారట. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో 'పవన్‌కళ్యాణ్‌' ప్రచారం చేయబోతున్నారట. అదేంటి...ఆయనకు అక్కడ పార్టీ లేదు కదా..ఎవరి తరుపున ప్రచారం చేస్తారని అడుగుతున్నారా...? ఆయన కర్ణాటకలో జెడిఎస్‌ తరుపున ప్రచారం చేయబోతున్నారట. జెడిఎస్‌ నాయకుడు 'కుమారస్వామి తనకు మిత్రుడని...అందుకే ప్రచారానికి వెళుతున్నానని ఆయన చెబుతున్నారట. కానీ...ఈ మాటల్లో నిజం లేదని...ఆయన... బిజెపిని రక్షించేందుకే..కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో దాదాపు 70 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థితిలో ఉన్న తెలుగుఓటర్లల్లో చీలిక తేవడమే లక్ష్యంగా ఆయన అక్కడ ప్రచారం చేయబోతున్నారనేది వారి మాట. ఆంధ్రాకు అన్యాయం చేసిన 'బిజెపి'తో కసితో ఉన్న తెలుగుఓటర్లు..మూకుమ్మడిగా..కాంగ్రెస్‌కు ఓటు వేయాలనే భావనతో ఉన్నారు. ఇప్పుడు..ఆ ఓట్లు...అన్నీ కాంగ్రెస్‌కు పడకుండా...వాటిని జెడిఎస్‌కు మళ్లించే విధంగా 'పవన్‌' కృషి చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గెలుపు, ఓటములను నిర్ణయించే తెలుగు ఓట్లను చీలిస్తే...ఆ మేరకు బిజెపికి లాభం చేకూరుతుందని...బిజెపి పెద్దలు, పవన్‌ కళ్యాణ్‌లు కలసి ఈ పథకం వేశారని తెలుస్తోంది. అందుకే...ఇప్పుడు హడావుడిగా.. ఆయన 'కర్ణాటక' ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారని అంటున్నారు. మొత్తం మీద తన రహస్యస్నేహితుడిని ఆదుకోవడానికి...'పవన్‌' చేస్తోన్న ఈ ప్రయత్నాలు ఏమేర ఫలిస్తాయో...వేచి చూడాల్సిందే...!

(1008)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ