WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిజెపిలోకే...'లక్ష్మీనారాయణ'...!

ఐపిఎస్‌కు సర్వీసు వదలి రాజకీయాల్లోకి వస్తారని భావిస్తున్న సీబీఐ మాజీ జెడి 'లక్ష్మీనారాయణ' బిజెపి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారట. తొలుత ఆయన రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వచ్చినప్పుడు సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' స్థాపించిన 'జనసేన'పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' స్పందిస్తూ...'లక్ష్మీనారాయణ'కు తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని...ఆయన పార్టీలో చేరితో సంతోషిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో..'లక్ష్మీ' 'జనసేన'లో చేరడం ఖాయమని... వీరిద్దరూ కలసి 'జనసేన'ను పటిష్టం చేసి...రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తులుగా ఎదుగుతారని 'పవన్‌' అభిమానులు భావించారు. కానీ...అనూహ్యంగా.. 'లక్ష్మీనారాయణ' తాను ఆ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. జాతీయ భావాలు అధికంగా కలిగిన 'లక్ష్మీనారాయణ' మొదటి నుంచి భావిస్తున్నట్లే...బిజెపిలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రజలు 'బిజెపి'పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో...ఆయన ఆ పార్టీలో చేరితే ఆయనకు నష్టం చేకూరుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా...కూడా ఆయన అదే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారట.

   కాగా...ఆయన రాజకీయాల్లోకి రావాలని భావించినప్పుడు టిడిపిలో చేరాలని అనుకున్నారట. 2014 ఎన్నికల సమయంలో ఆయన టిడిపిలోకి రావడం లాంఛనమే అన్న ప్రచారం జరిగింది. అయితే...ఆయన రాకను టిడిపి అధ్యక్షుడు 'చంద్రబాబు' అడ్డుకున్నారట. వై.ఎస్‌.జగన్‌, గాలి జనార్థన్‌రెడ్డి, సత్యం కుంభకోణం కేసుల్లో నిజాయితీగా పనిచేసిన 'లక్ష్మీనారాయణ'ను తమ పార్టీలోకి తీసుకుంటే...'లక్ష్మీనారాయణ', టిడిపి కలసి తమపై కేసులు పెట్టించిందని...'జగన్‌' ఆరోపించే అవకాశాలు ఉండడంతో..ఆయనను పార్టీలోకి తీసుకోకూడదని...'చంద్రబాబు' నిర్ణయం తీసుకున్నారట. దీంతో...'లక్ష్మీనారాయణ' రాజకీయ అరంగ్రేటానికి తెరపడింది. మళ్లీ ఇప్పుడు... ఆయన వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని...రాజకీయాల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నారట. నిజాయితీపరుడిగా, సమర్థుడిగా..పేరున్న 'లక్ష్మీనారాయణ'...రాష్ట్రానికి అన్యాయం చేసిన 'బిజెపి'లో చేరడం...ఆయన అభిమానులకు మింగుడుపడడం లేదు. మరి...ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో...వేచి చూడాల్సి ఉంది.

(494)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ