WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' వద్ద 'జగన్‌' కోవర్ట్‌లు...!?

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చుట్టూ....'జగన్‌' కోవర్టులు ఉన్నారా...? అంటే అవుననే అంటున్నారు...కొంత మంది టిడిపి నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు తెలుసుకుని కొంత మంది నాయకులు...ప్రతిపక్షనేతకు ఉప్పందిస్తున్నారనే వారు అంటున్నారు. ఇంతకు ముందు రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 'చంద్రబాబు' వ్యూహాలను, ఎత్తుగడలను...ఆయనకు కొంత మంది టిడిపి నాయకులు ఎప్పటికప్పుడు చేరవేసేవారు. అప్పట్లో ఆ సంగతి 'చంద్రబాబు' కూడా కనిపెట్టారు. కానీ...అప్పటి పరిస్థితుల్లో ఆ కోవర్ట్‌లపై చర్యలు తీసుకోలేక వారంతట వారే తప్పుకునే విధంగా 'చంద్రబాబు' వారిని దూరం పెట్టారు. అయితే...ఇప్పుడు మళ్లీ...అటువంటి నాయకులు కొంత మంది తయారయ్యారనే పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు...పార్టీలో చర్చనీయాంశమైంది.

  ఏప్రిల్‌2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని...అక్కడ వివిధ పార్టీలతో చర్చించి...ప్రత్యేకహోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాటం చేయాలని భావించారు. దీనిలో భాగంగా...ఢిల్లీలో దీక్ష చేయాలని కూడా ఆయన ఆలోచించారట. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో దీక్షకు కూర్చుంటే...కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి వస్తుందని..ఆయన భావించారట. ఇదే విషయాన్ని కొంత మంది నాయకులతో 'చంద్రబాబు' చర్చించారట. వెంటనే ఈ దీక్ష గురించి ప్రతిపక్ష నాయకుడికి ఉప్పందిట. దీంతో...'చంద్రబాబు' కంటే ముందే...వై.ఎస్‌.జగన్‌ తమ పార్టీ ఎంపీలు...రాజీనామాలు చేస్తారని...ఆ వెంటనే ఆమరణ దీక్షకు కూర్చుంటారని ప్రకటించి...టిడిపిని ఇరకాటంలోకి నెట్టారు. తాము చేద్దామనుకుంటున్న దీక్ష విషయం వైకాపాకు ఎలా తెలిసిందని..కొందరు టిడిపి నాయకులు తర్జనభర్జనలు పడుతున్నారట. కొంత మంది కోవర్ట్‌లు..ఈ విషయాన్ని 'జగన్‌'కు చేరవేశారని.. వారెవరో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు...దీనిపై దృష్టిసారిస్తారో...లేక వదిలేస్తారో..చూడాలి మరి.

(984)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ