WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'ను 'పూనమ్‌కౌర్‌' కలుస్తుందా...!?

అవిశ్వాస తీర్మానంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు...ఢిల్లీ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును...సినిమా నటి 'పూనమ్‌కౌర్‌' కలుసుకోబోతోందని...ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న 'పూనమ్‌కౌర్‌' ఇటీవల కాలంలో 'కత్తి మహేష్‌' ఆమెను వివాదంలోకి లాగారు. ఒక సినిమా నటుడు, పార్టీ అధ్యక్షుడికి మధ్య ఆమెకు సంబంధం ఉందని...ఆమెను అతను మోసం చేశాడని 'కత్తి' ఆరోపించారు. ఈ వివాదంపై అప్పట్లో...పూనమ్‌కౌర్‌ కూడా స్పందించి ట్విట్టర్‌లో కొన్ని వ్యాఖ్యలు చేసి...తరువాత డిలీట్‌ చేసింది. అప్పటి నుంచి...ఆమె  పరోక్షంగా సినిమానటుడు,పార్టీ అధ్యక్షుడుపై విమర్శలు గుప్పిస్తోంది. 'కాన్సెప్ట్‌లు కాపీ...చేసి...బట్టలు మార్చుకుంటూ...మాటపై నిలబడకుండా...జనాలను అమాకులను చేస్తూ...అమ్మాయిలను అడ్డం పెట్టుకుంటూ...రాజకీయాలు చేస్తోన్న వారి గురించి భగవంతుడే నిజాలు తెలియజేయాలని కోరుకుంటున్నా...' అంటూ ఇటీవల ఆమె ట్వీట్‌ చేశారు. 

   ఇదంతా ఆ నటుడు గురించేనని అందరికీ అర్థం అయింది. అయితే ఇప్పుడు...తనను మోసం చేసిన నటుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ..తనకు న్యాయం చేయాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఢిల్లీలో కలవబోతున్నారట. ఇప్పటికే...ఆమె సిఎం అపాయింట్‌మెంట్‌ అడిగారని...ఆమెకు 4వ తేదీన ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరికిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. తనను మోసం చేసిన వ్యక్తి గురించి..అందరికీ తెలుసునని..ఆ వ్యక్తి వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లు..తన వద్ద కూడా ఉన్నాయని..వాటిని సిఎంకు అందజేస్తానని ఆమె చెబుతున్నారట. ఒక వేళ ఆమె కనుక సిఎంను కలసి..పెన్‌డ్రైవ్‌లు ఇస్తే...రాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు తిరుగుతాయని...రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద...'కత్తి మహేష్‌' తీసుకొచ్చిన...పూనమ్‌కౌర్‌..వివాదం తిరిగి...తిరిగి..ఒక రాజకీయ పార్టీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్మేలా ఉన్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో..చూడాలి మరి...!


(656)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ