WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'తమ్మినేని' సెంటిమెంట్‌...'కోన'కు వర్తించేనా...!?

అసెంబ్లీ విప్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'కూన రవికుమార్‌' మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టిస్తారా...? ఓడిపోయి..సెంటిమెంట్‌ను నిజం చేస్తారా..? వివరాల్లోకి వెళితే..1983,85ల్లో ఆముదాలవలస ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నాలుగున్నరేళ్లకు పైగా అసెంబ్లీ విప్‌ పదవి నిర్వహించి 1989లో ఓడిపోయారు. అసెంబ్లీ విప్‌ పదవి నిర్వహించారు కనుకే..ఆయన ఓడిపోయారు..ఆయనకు ఆ పదవి కలసి రాలేదని..ఆయన అనుచరులు వాపోయేవారు. కానీ..1989లో ఓడిపోయినా 1991లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ రాజకీయవేత్త కీ.శే.బొడ్డేపల్లి రాజగోపాల్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించారు 'తమ్మినేని'. అటువంటి 'తమ్మినేని'కి స్వయాన మేనల్లుడు అయిన 'కోన రవికుమార్‌' 2014లో ఆయనను ఓడించి...రెట్టింపు సంచలనం సృష్టించారు. 

  కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయ నాయకునిగా పేరున్న 'తమ్మినేని' 2009 ఎన్నికలకు ముందు..ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా..ఘోరంగా ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడోస్థానానికి పరిమితమయ్యారు. అప్పట్లో...టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మేనల్లుడు రవికుమార్‌ 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థిగా రంగంలోకి దిగిన మేనమామ 'తమ్మినేని'ని ఐదువేల ఓట్ల తేడాతో ఓడించారు. విచిత్రమేమిటంటే కోన రవికుమార్‌.. 'తమ్మినేని'కి మేనల్లుడే కాదు..స్వయానా ఆయన భార్యకు తమ్ముడు. అతి దగ్గరి బంధువులైన వీరిద్దరూ..కలిసిమెలసి రాజకీయాలు నడపగా...ప్రస్తుతం వీరిద్దరూ విరోధులుగా ఉన్నారు. తాను అసెంబ్లీ విప్‌గా ఓడిపోయానని..తన ప్రత్యర్థి మేనల్లుడు రవికుమార్‌ విప్‌గా ఉన్నారని...ఆయనకు కూడా..తన వల్లే ఓడిపోతారనే నమ్మకం 'తమ్మినేని'లో ఉంది. 'తమ్మినేని'కి ఎదురైన సెంటిమెంట్‌ 'రవికుమార్‌'కూడా ఎదురవుతుందా...వేచి చూడాల్సిందే...!

(239)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ