WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు' అభిమాని అయిన ఐఎఎస్‌ అధికారికి వేధింపులా...!?

పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖాధిపతిగా ఏకచత్రాధిపత్యంగా అధికారం చెలాయిస్తోన్న 'జవహర్‌రెడ్డి' దూకుడుకు అడ్డుకట్టవేయటం జరిగింది. అదేమిటంటే..ఆశాఖలో కలసి ఉన్న గ్రామీణనీటిసరఫరా,శానిటీశాఖల అధిపతిగా ఐఎఎస్‌ అధికారి రామాంజనేయులును నియమించిన విషయం విధితమే. ఆ తరువాత..రామాంజనేయులకు ఆశాఖ ఉన్న భవనంలో...కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటికి ఆ గదిలో గృహనిర్మాణశాఖ ఎక్స్‌అపీషియో కార్యదర్శి కాంతిలాల్‌దండే ఉన్నారు. ఆయనకు మరొక గదిని కేటాయిస్తూ...ఈ గదిని 'రామాంజనేయులు'కు కేటాయిస్తున్నట్లు జిఎడి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంత వరకు అది బాగానే ఉంది. తరువాత ఆ ఉత్తర్వులు సవరిస్తూ...రామాంజనేయులు, దండే కలసి ఒకే గదిలో ఉండాలని మరొక ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నటి వరకు సెలవులో ఉన్న సిఎస్‌కు తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందని...'జవహర్‌రెడ్డి' ఒత్తిడితోనే జిఎడి అధికారులు ఈ విధంగా వ్యవహరించారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. రామాంజనేయులు మరో మూడు నెలల్లో రిటైర్‌ కాబోతున్నారు. తాను..కార్యదర్శి హోదాలో రిటైర్‌ కావాలని ఉందని...సచివాలయంలో ఆ హోదాలో నియమించమని...'రామాంజనేయులు' సిఎంను, సిఎస్‌ను కోరడంతో..ఆయనను ఆ పోస్టులో నియమించారు. అప్పట్లో...'రామాంజనేయులు'ను ఆ పోస్టులో నియమించడాన్ని భరించలేని 'జవహర్‌రెడ్డి' ఆ శాఖను తనకే అప్పగించాలని సిఎంఒ కార్యదర్శి సతీష్‌చంద్రకు లేఖ రాసినట్లు బయటకు పొక్కింది. ఆయా శాఖలనైతే..'జవహర్‌రెడ్డి'కి కేటాయించలేదు కానీ..ఆయాశాఖల  పరిధిలోని అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు విషయం జహవర్‌రెడ్డి చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తాను సిఎంకు వీరాభిమానినని..తనను పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో ఎంతో కష్టపడి బాధ్యతలు నిర్వహించానని...నరేగా పథకం జాతీయ స్థాయిలో విజయవంతం అవడానికి తాను చాలా కృషి చేశానని..ఈ విషయంపై సిఎం చంద్రబాబు పలుసార్లు తనను అభినందించారని..తాజాగా తన పోస్టు విషయంలో సిఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని..'రామాంజనేయులు' చెబుతున్నారు. ఒకప్పుడు అదే గదిలో గ్రామీణాభివృద్ధిశాఖ అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. అదే గదిని 'రామాంజనేయులు'కు కేటాయించాలని సిఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తతంగంలో 'జవహర్‌రెడ్డి' కారణమని, జిఎడి పొలిటికల్‌ కార్యదర్శి శ్రీకాంత్‌ కూడా ఒత్తిడికి తలొగ్గారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఒక సీనియర్‌ దళిత అధికారికి, సిఎం అభిమాని అయిన అధికారికి ఇంత అవమానం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలుసో లేదో..కానీ..సిఎస్‌కు మాత్రం తెలియదు. కానీ ఈ విషయంలో శాఖ మంత్రి లోకేష్‌ పేరు కూడా బయటకువచ్చింది. శాఖల కేటాయింపు సమయంలో 'లోకేష్‌' కలుగచేసుకున్నారని, గదుల కేటాయింపు విషయంలో కూడా ఆయన కలుగ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రామాంజనేయులు సర్వీసు ముగిసిన తరువాత ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. సిఎం వీరవిధేయుడైన 'రామాంజనేయులు'కే ఇటువంటి పరిస్థితి ఎదురైతే..తమ వంటి శాఖాధిపతుల పరిస్థితి ఏమిటో తెలియడంలేదని కొంత మంది శాఖాధిపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఒక వెలుగు వెలిగి...సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న సమయంలో ఆయన కార్యాలయ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన 'జవహర్‌రెడ్డి' కీ.శే.వై.ఎస్‌ కుటుంబానికి వీరాభిమానిగా పేరుంది. నిత్యం 'చంద్రబాబు,లోకేష్‌లు వైకాపా అధినేత 'జగన్‌'పై విమర్శలు,ఆరోపణల దాడి చేస్తున్నారు..కానీ జగన్‌ కుటుంబానికి వీరాభిమాని అయిన అధికారిని నెత్తిపైన పెట్టుకుని పూజిస్తున్నారు. 'రామాంజనేయుల'కు ఇంత అవమానం గురిచేయడం సరికాదని...దళిత అధికారిని వేధింపులకు గురిచేయటం సరికాదని..టిడిపికి చెందిన దళిత నాయకుడు మీడియా వర్గాలకు చెప్పారు. ఈ కథ ఎటువంటి మలుపులు తిరగనుందో..ఎలా సుఖాంతం అవుతుందో..ఎప్పటికి ముగింపు అవుతుందో వేచి చూడాల్సిందే.

(331)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ