WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జవహర్‌రెడ్డి' పేరుతో మధ్యవర్తుల వసూళ్లు....!

పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో శాఖాధిపతి 'జవహర్‌రెడ్డి' పేరును ఉపయోగించుకుంటూ ఇద్దరు మధ్యవర్తులు, ఒక మాజీ ఎమ్మెల్సీ అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు అందినంత వరకు దోచుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం శాఖాధిపతి 'జవహర్‌రెడ్డి'కి తెలుసో లేదో కానీ...సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో ఆశాఖలో పనిచేసే వారిలో ఎక్కువ మందికి ఈ విషయం తెలుసు. కానీ..నోరు మెదపరు..సహచర ఉద్యోగులకు, సన్నిహితులకు మాత్రమే ఈ విషయం చెబుతున్నారని బయటకు పొక్కింది. అసలు విషయం ఏమిటంటే..హైదరాబాద్‌లో ఉండే 'సుబ్రహ్మణ్యం, పురుషోత్తంరెడ్డి అనే వ్యక్తులు 'జవహర్‌రెడ్డి' కార్యాలయానికి వచ్చిపోతుంటారు. ఆయన కార్యాలయంలో గంటల కొద్ది చర్చలు జరుపుతారనే ప్రచారం ఉంది. అనేక మంది దగ్గర లక్షల రూపాయలు తీసుకుని కొన్ని పనులు చక్కపెట్టిన 'సుబ్రహ్మణ్యం' మరి కొంత మందికి ఆ పనులు చేయలేక హైదరాబాద్‌ వెళ్లిపోయారు..మళ్లీ వెలగపూడి రావడం లేదు. సుబ్రహ్మణ్యంకు అడ్వాన్స్‌లు ఇచ్చిన వారు ఫోన్‌లు చేసి అడుగుతుంటే...అదుగో...ఇదుగో..అని కొన్ని రోజుల పాటు చెప్పి...ఇటీవల కాలంలో ఫోన్లు ఎంతటం మానేశారని...చెబుతున్నారు. ఇదే విషయంపై 'జనమ్‌ఆన్‌లైన్‌'.కామ్‌' ప్రతినిధితో మాట్లాడుతూ..తాను ఎక్కడికి రమ్మంటే...అక్కడికి వచ్చి ఈ విషయంపై చెబుతానని చెబుతున్నారు. నిన్న మొన్నటి దాకా 'జవహర్‌రెడ్డి' కార్యాలయంలో పనిచేసే 'సుబ్రహ్మణ్యం' ఇటీవల రావడం లేదట. మరో వ్యక్తి పురుషోత్తంరెడ్డి...ఆయన 'జవహర్‌రెడ్డి' వద్దకు వస్తుంటారని..ఆయన గదిలోనే గంటల కొద్ది తిష్టవేస్తుంటారని..ఆయనకు పనులు చక్కపెట్టమని కొందరు లక్షలు రూపాయలు ఇచ్చామని కొందరు సన్నిహితులకు చెప్పుకుని వాపోతున్నారు. పురుషోత్తంరెడ్డిని కలసి పనులు చక్కపెట్టుకోండి..ఆయనకు ఏదో ఒకటి ఇచ్చి...సంతృప్తి పరచండి...ఒకప్పుడు ఆశాఖకు మంత్రిగా ఉన్న 'అయ్యన్నపాత్రుడు'కు అంతరంగిక అధికారిగా ఉన్న వ్యక్తి చెబుతున్నారట. 

  డిపిఒ ఒకరు ఏసీబీ కేసులో పట్టుబడితే..ఆ కేసును తొలగించేందుకు...పురుషోత్తం రెడ్డిని ఆశ్రయించారని..ఆశాఖ అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ఎక్సైజ్‌శాఖకు చెందిన అధికారి ఒకరు 'జవహర్‌రెడ్డి' కార్యాలయంలో గంటల కొద్ది కూర్చుంటారని..ఆయన కూడా పనులు చక్కపెడుతున్నారని..ఆరోపణలు వస్తున్నాయి. టిడిపి జాతీయ కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.జనార్థన్‌ కూడా...'జవహర్‌రెడ్డి'కి సన్నిహితంగా మెలుగుతారట. ఇప్పటికీ..అదే పోస్టులో 'జవహర్‌రెడ్డి' కొనసాగడానికి...'జనార్థనేనని..ఆయన 'లోకేష్‌' వద్ద మంత్రాంగం నెరపుతూ...కొనసాగించే విధంగా చేశారట. 'జవహర్‌రెడ్డి' అదనంగా గ్రామీణాభివృద్ధిశాఖను కూడా ఇచ్చి ప్రోత్సహించారట. ఆయన కూడా..'జవహర్‌రెడ్డి' ద్వారా చాలా పనులు చక్కపెట్టుకున్నారని...ఆయన అనేక మంది సలహాలు,సహాయాలు చేశారని ప్రచారం జరుగుతోంది. సుబ్రహ్మణ్యం..ఇటీవల కాలంలో వెలగపూడి సచివాలయానికి రాకపోవడంతో...ఆయనకు ఎక్కడో బెడిసి కొట్టిందని...ఆయన బాధితులైన ఒక అధికారి చెబుతున్నారు. ఈశాఖలో సకాలంలో వస్తోన్న ఫైల్స్‌ను పరిశీలించకుండా...పెండింగ్‌లో ఉన్న పైళ్లను పరిష్కరించకుండా...కొన్ని పైళ్ల పరిష్కారంలో అత్యుత్సాహం చూపడంతో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈశాఖ మంత్రిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు నిర్వహించినప్పుడు స్వామి కార్యాలతో పాటు స్వకార్యం కూడా చక్కపెట్టుకున్నారు. లోకేష్‌ శాఖ బాధ్యతలు చేపట్టినా..పాత పరిస్థితుల్లో మార్పులు...చేర్పులు జరగలేదని..అప్పటి కంటే ఎక్కువగా...పనులు జరుగుతున్నాయనే విమర్శ వస్తోంది. సుబ్రహ్మణ్యం పారిపోయాడు..పురుషోత్తంరెడ్డి వస్తూపోతున్నాడు..మాజీ ఎమ్మెల్సీ అప్పుడప్పుడు వస్తుంటారు...టిడిపి ఎమ్మెల్సీ 'జనార్థన్‌' వస్తుంటారు..పోతుంటారు...వీరి సిఫార్సులతో అనేక పనులు చక్కపెట్టిన మాట వాస్తమే...ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేశారనే విషయంపై ఏసీబీ విచారణ జరిపితే..వెనుక ఉన్న పెద్దల బాగోతాలు బయటపడడం ఖాయం. శాఖాధిపతి 'జవహర్‌రెడ్డి'ని బాధితులు ఎవరూ నేరుగా కలిసిన పరిస్థితులు లేవు. మధ్యవర్తులు..తనపేరుతో..పనులు చక్కపెడుతున్న సంగతి...'జవహర్‌రెడ్డి'కి తెలుసా...? లేదో..తెలియదు..కానీ..అనేక పనులు మధ్యవర్తులు..చక్కపెట్టారు..లక్షలు దోచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు శాఖలోనే...ఇటువంటి పరిస్థితులు ఉంటే మిగతా శాఖల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో...? తన కుమారుడు అందరి మంత్రుల కన్నా పైల్స్‌ పరిష్కారంలో ముందుంటారని 'చంద్రబాబు' చెప్పుకుంటున్నారు..ఈశాఖలో ఏయే..పైల్స్‌ ఎప్పుడు వచ్చాయి...ఎన్ని పరిష్కారానికి నోచుకున్నాయి...మధ్యవర్తుల ప్రమేయం...బాగా పనిచేసిన మాట యధార్థమే...తీసుకున్న సొమ్ము ఎవరెవరికి ఎంత ముట్టిందో...తమకు తెలియదు కానీ..మధ్యవర్తులు చాలా పనులు చక్కపెట్టారని...దీనిపై సిఎం ఆయన కుమారుడు విచారణ చేయించగలిగితే...వెలుగులోని రాని ఎన్నో అక్రమాలు బయటకు రావడం ఖాయం. 

  ఈ మధ్యవర్తుల బాగోతం...పంచాయితీరాజ్‌ గ్రామీణశాఖలో పనిచేస్తోన్న జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు...కింది స్థాయి అధికారులకు తెలుసు. తన పేరుతో...భారీగా లక్షలు వసూలు చేశారని 'జవహర్‌రెడ్డి' తెలుసా..తెలియదా..? అనే విషయానికి ఆధారాలు లేవు. కానీ పనులు చక్కపెట్టారు..భారీగానే వెనుకేసుకున్నారు. మంత్రి లోకేష్‌ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో...నాలుగేళ్లుగా..ఇదే శాఖకు 'జవహర్‌రెడ్డి' బాధ్యతలు నిర్వహిస్తున్నవిషయం విధితమే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీ 'జనార్థన్‌'ను పిలిచి నిలదీస్తే...వాస్తవాలు బయటకు వస్తాయి...అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ సచివాలయానికి...అందులోనూ..పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖకు ఎందుకు వస్తున్నారు. మాయమైన మధ్యవర్తి సుబ్రహ్మణ్యం తీసుకున్న సొమ్మును వాపసు ఇవ్వకుండా...మొహం చాటేశారని..ఇప్పటికే పురుషోత్తంరెడ్డి లక్షలు తీసుకున్నారని...అందులో చాలా మంది పనులు చక్కపెట్టాల్సి ఉందని బాధితులు చెబుతున్నారు. అసలు విచారణ జరిపిస్తే..తెర వెనుక బోక్తలు..తెరముందు బోక్తలు బయటకువస్తారని వారు చెబుతున్నారు. దీనిపై మంత్రి లోకేష్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

(275)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ