WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'కు కాపులు..చేయూతనిస్తారా...చేయిస్తారా...!?

టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు కులస్తులకు అటు పదవుల్లో పెద్దపీట వేశారు..ఇటు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి..ఇప్పటి వరకు నాలుగువేలకోట్ల రూపాయల సహాయం చేశారు. అంతే కాకుండా కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు కల్పించాలని...అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 'చంద్రబాబు' సేవ చేశారని..అధికారపార్టీ ప్రముఖులు...రాజకీయపార్టీలకు సంబంధం లేని కాపు కుల నాయకులు..కాపు కార్పొరేషన్‌ ద్వారా కాపులకు సహాయం అందిందని...ముద్రగడ కూడా అంగీకరించారు. అటువంటి కాపులు..ఈసారి తమ అభిమానాన్ని ఎవరి వైపు చూపుతారు..అనేదానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికీ 80శాతం పైగా కాపులు 'పవన్‌'కు మద్దతు ఇస్తున్నారని మాజీ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించిన విషయం విదితమే. కాపుల్లో మెజార్టీ వర్గం టిడిపికే మద్దతు ఇస్తారని...ఇది కేవలం పాలపొంగు...మరి కొన్ని రోజులు ఆగండి...వారు ఎవరికి మద్దతు ఇస్తారో..తేలిపోతుందని కాపు మంత్రులు చెబుతున్నారు. కాపులకు విదేశాలకు వెళ్లేందుకు నిధులు, వారి విద్యార్థిలు చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లు..ఇంకా ఎన్నో పథకాలు అమలు చేసిన 'చంద్రబాబు'కు మద్దతు ఇస్తారా...? ఒకప్పుడు 'చిరంజీవి'కి మద్దతు ఇచ్చిన కాపులు..ఇప్పుడు పవన్‌కు మద్దతు తెలుపుతారా..? జనసేన సభకు హాజరైన వారిలో కాపు సమాజికవర్గానికి చెందిన వారేనని..మిగతా వారు..తక్కువేనని వివిధ చర్చా వేదికల్లో ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవైపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం..మరోవైపు టిడిపిపై విమర్శలు చేస్తోన్న 'పవన్‌'..మరోవైపు అధికారం కోసం అర్రులు చాస్తున్న 'జగన్‌'...ఇంకోవైపు కాపుల మద్దతు పొందాలని ప్రాకులాడుతున్న బిజెపి నాయకులు..ఈ నలుగురిలో కాపులు ఎవరు వైపు మొగ్గుచూపుతారనే విషయంపై కాపు కులంలోనే టెన్షన్‌ కనిపిస్తోంది. 

  తాను కులమతాలకు అతీతున్ని...అని పదే పదే ఉపన్యాసాలు చేస్తోన్న 'పవన్‌'ను ఇప్పటికీ అభిమానిస్తుందీ...మెజార్టీ కాపులనే విషయం 'పవన్‌'కు తెలుసు..రాజకీయపార్టీలకు తెలుసు. 2004లో కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపిన కాపులు 2009లో ప్రజారాజ్యానికి మద్దతు ఇచ్చారు..తిరిగి 20014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చి అధికారిన్ని కట్టపెట్టారు. స్వతాగా పోటీ చేసే అధికారంలో రామని..తాము ఎవరికి మద్దతు ఇస్తే..వారే అధికారాన్ని కైవసం చేసుకుంటుందని...అనుభవంతో కాపులు తెలుసుకున్నారు. అప్పట్లో వై.ఎస్‌ను..గతంలోనూ..2014లోనూ 'చంద్రబాబు'ను ముఖ్యమంత్రిని చేశాం...మేము ఏ పార్టీకి మద్దతు ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయేతర కాపులు చెబుతున్నారు. ఏది ఏమైనా కాపుల పయనమెటు అనే విషయం ఇప్పట్లో తెలియకపోయినా...మెజార్టీ..యువకాపు ఓటర్లు 'పవన్‌'కు మద్దతు ఇస్తారా..? లేదా తమ పెద్దల మాట విని మరో పార్టీవైపు మొగ్గుచూపుతారా..? ఈ విషయం ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ ఇస్తేకానీ బయటకు రాదు. అప్పటి వరకు రాజకీయ వర్గాల్లో ఈ ఉత్కంఠత తప్పదు.

(218)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ