WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా...!?

త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపడతారని, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తారని...గుంటూరు జిల్లా పార్టీ నాయకుల్లో జోరుగా జరుగుతున్న ప్రచారాన్ని టిడిపి ప్రముఖులు కొట్టిపారేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనుచూపుమేర లేవని...ఇప్పుడు 'చంద్రబాబు' ఆ కందిరీగ తుట్టెను కదిలించరని..పార్టీ ముఖ్యులు చెబుతూ...కొంత మంది పార్టీనేతలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై చినబాబు కూడా పెదవి విప్పలేదు. కొంత మంది సన్నిహితులతో...ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే ఖాళీగా ఉన్న దేవాదాయశాఖను కె.ఇకి అప్పగించాం..ఖాళీగా ఉన్న వైద్య,ఆరోగ్యశాఖను 'కిమిడి'కి ఇస్తారని...ఒకవేళ ఇవ్వకపోయినా..ఆ శాఖను ముఖ్యమంత్రే చూస్తారని చెప్పారట. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని...కొంత మందిని మంత్రులుగా తొలగిస్తారని...కొందరికి ఎమ్మెల్యే పదవులు ఇస్తారని...చెబుతుంటే...ఏ ఒక్కరూ...నమ్మడంలేదు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం...పై ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. మంత్రివర్గ విస్తరణపై సిఎం అభిప్రాయం ఎలా ఉందో....బయటపడడం లేదు. ఆయనను ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే...ఆయన అంతరంగం బయటపడదు. అంత వరకు మంత్రివర్గ విస్తరణ గురించి విషయాలు తెలుస్తాయి. దీనిపై ముందు ముందు ఏమి జరుగుతుందో...వేచి చూడాల్సి ఉంది.

(285)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ