WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపా ఎంపీలు రాజీనామా...!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని వైకాపా ఎంపీలు ప్రకటించారు. శుక్రవారం లోక్‌సభ వాయిదా వేసిన తరువాత...ఎంపీలు 'మిధున్‌రెడ్డి,రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, సుబ్బారెడ్డి,అవినాశ్‌రెడ్డిలు తమ రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు సమర్పించారు. స్పీకర్‌ ఫార్మట్‌లో వైకాపా ఎంపీలు తమ రాజీనామాలను సమర్పించారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను ఎంపీలు కోరారు. రాజీనామాలు చేసిన ఎంపీలు ఆంధ్రాభవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే..వారు..దీనిపై ప్రకటన చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వనందునే తాము రాజీనామాలు చేస్తున్నామని అనంతరం విలేకరులతో వైకాపా ఎంపీలు చెప్పారు.


(216)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ