WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'తో పెట్టుకుని తప్పుచేశానా...!?

'చేతులు కాలాక...ఆకులు పట్టుకున్నాడని...సామెత...! ఇప్పుడు అచ్చం...'మోడీ' పరిస్థితి అదే విధంగా ఉంది. అనవసరంగా...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో వైరం పెట్టుకుని... జాతీయ స్థాయిలో పరువు తీసుకున్న తరువాత...తానేం చేశాడో..అర్థం అవుతుంటే...ఏమి చేయాలో పాలుపోని స్థితిలో...'చంద్రబాబు' తన పరువు ఎలా తీశాడో...అని...వీడియోలు పెట్టుకుని తీరిగ్గా చూసుకుంటున్నారట 'మోడీ'. ఢిల్లీ నడిబొడ్డులో...'మోడీ'ని 'చంద్రబాబు' కడిగివేసిన వీడియోలు... ఇప్పుడు బిజెపి నేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయట. 'మోడీ' అయితే...పదే పదే 'చంద్రబాబు' ప్రసంగించిన వీడియోలు చూస్తూ...ఇలా జరగకుండా ఉంటే బాగుండేదన్నట్లు నిట్టూర్పులు విడిస్తున్నారట. అసలు తాను 'చంద్రబాబు'తో...ఎందుకు వైరం తెచ్చుకున్నాను..? 'బాబు'తో వైరం తెచ్చుకున్నా...మధ్యలో అయినా...రాజీ చేసుకుంటే పోయేది కదా...? అనవసరం తెగే వరకు లాగాను...! ఇప్పుడు జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నానని...వాపోతున్నారట. 'చంద్రబాబు' ఢిల్లీలో ప్రదర్శించిన 'వీడియో'లు 'మోడీ' ప్రధాని కార్యాలయంలో వేసుకుని చూస్తోన్న సంగతిని...'బిజెపి'కి చెందిన వర్గాలే పదే పదే చెప్పుకుంటూ...'మోడీ'కి ఇలాగే కావాలి...అని ఎంజాయ్‌ చేస్తున్నారట.

అనుమానంతోనే 'బాబు'తో వైరం....!

ఎప్పటికైనా...ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి ఎసరు తెస్తారనే...ఆలోచన వల్లే...'బాబు'తో 'మోడీ' వైరం కొని తెచ్చుకున్నారని ఢిల్లీ అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తిలేదని...'చంద్రబాబు' పదే పదే చెప్పినా...ప్రధాని మోడీ పట్ల సంపూర్ణ విధేయత చూపినా...'మోడీ'కి ఉన్న అనుమానమే...ఇప్పటి పరిస్థితికి కారణం....అని వారు..విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని...'చంద్రబాబు'ను తొక్కివేస్తే...తనకు జాతీయ స్థాయిలో ఎదురే లేకుండా ఉంటుందన్న ఆలోచనే....'చంద్రబాబు'తో వైరానికి 'మోడీ'ని ఉసిగొల్పిందనే మాట వినిపిస్తోంది. వివిధ ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్న ఎంపి విజయసాయిరెడ్డిని దగ్గరకు తీసి...'చంద్రబాబు'పై ఉసిగొల్పి...ఆయన పరువు తీయాలని ప్రయత్నం చేసినా..అవి ఫలించలేదు. చివరకు...పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి సమాధానం చెప్పలేక...పారిపోవాల్సిన పరిస్థితి 'మోడీ' తెచ్చుకున్నారు. 'బాబు'పై..అక్కసుతో...'మోడీ' ఎంత దిగజారితే....'చంద్రబాబు' నాలుగుమెట్లు..పైకి ఎకబాగి...దేశస్థాయిలో..'మోడీ'కి తానే...సరైన ప్రత్యర్థిని అని రుజవు చేసుకున్నారు. ఇదంతా 'మోడీ' చేజేతులారా చేసుకున్నదే...!

 కాగా...'మోడీ' అనవసరంగా...'చంద్రబాబు'తో పెట్టుకున్నారని...ఆయనతో వైరం పెట్టుకోకుండా... సామరస్యంగా వ్యవహరిస్తే...'మోడీ' మరో ఐదేళ్లు ప్రధానిగా ఉండేవారని...'చంద్రబాబు'తో సన్నిహితంగా ఉండే...ఆంధ్రా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం... జాతీయస్థాయిలో..'మోడీ'కి సాటి వచ్చే...ఒకే ఒక్క నాయకుడు 'చంద్రబాబు' అని...అటువంటి నాయకుడితో..'మోడీ' మొరటుగా వ్యవహరించి...దెబ్బతిన్నారని విశ్లేషించారు. 'చంద్రబాబు'తో సామరస్యంగా వ్యవహరిస్తే...ఆయన చాలా ఉదారంగా ఉండేవారని...అదే సమయంలో...'ఆంధ్రా'కు ఇచ్చిన హామీల్లో కొన్నిటినైనా..నెరవేర్చి ఉంటే...'చంద్రబాబు' సంతోషంగా...'మోడీ'తోనే సర్దుకుపోయేవారని వ్యాఖ్యానించారు.  అసలు ఏమీ చేయకుండానే...'చంద్రబాబు'ను అదుపులో పెట్టుకోవాలన్న ఆతృతే...'మోడీ' కొంప ముంచిందని ఆయన అన్నారు. ఆరు నెలలకో... సంవత్సరానికో..ఒకసారి...ఆంధ్రా రాజధాని...'అమరావతి'లో పర్యటించి...ప్రజలను ఉద్దేశించి... ప్రసంగించి...నిధుల గురించి చెప్పి...ప్రజలను, చంద్రబాబును ఆకట్టుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని...ఆయన అన్నారు. అదే సమయంలో...నూతనంగా నిర్మించే..రాజధాని.. అమరావతికి సహాయం చేసి..తన పేరును చరిత్రలో నిలిచిపోయే...అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నారని...ఇప్పుడు కాకపోయినా..రేపైనా 'చంద్రబాబు' రాజధాని నిర్మిస్తారని...ఆ రాజధానిలో మాత్రం 'మోడీ' పేరు ఉండదని...ఐదేళ్లు...ప్రధానిగా ఉన్న వ్యక్తి...'చంద్రబాబు'తో వైరం పెట్టుకోకపోయి ఉండే మరో ఐదేళ్లు ప్రధానిగా ఉండేవారని...కానీ...అనవసర అహంభావం, అసూయతో వచ్చిన అవకాశాన్ని 'మోడీ' చేజేతులారా చెడగొట్టుకుని చరిత్రహీనుడిగా మిగిలి పోయారని ఆ అధికారి ఘాటుగా వ్యాఖ్యానించారు.


(2429)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ