WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబు'ను కీర్తించిన 'జాతీయమీడియా'...!

అవి ఉమ్మడి రాష్ట్ర విభజన రోజులు...! ఈ రోజో....రేపో...పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు పెట్టబోతున్నారు. రాష్ట్రమంతా...అగ్నిగుండలా మారింది. ఒక ప్రాంతం విభజనకు అనుకూలంగా... మరో ప్రాంతం వ్యతిరేకంగా...అట్టుడికిపోతోంది. రాష్ట్ర విభజన కోరేవారూ...వ్యతిరేకించేవారూ...ఢిల్లీలో ఏం జరుగుతోందంటూ....క్షణక్షణానికి...ఢిల్లీ వైపు చూసేవారు. విభజనను వ్యతిరేకించే వారు...ఏదో అద్బుతం జరగకపోతుందా...? విభజన ఆగిపోదా..? అని ఆఖరి ఆశలు పెట్టుకున్నవారు కొందరైతే... విభజనకు అనుకూలంగా ఉన్నవారు...ఇదే ఆఖరి యుద్ధమని...ఇక ఆగదని...విశ్వాసాన్ని ప్రదర్శించేవారు...ఇటు వంటి సమయంలో అప్పటి ప్రతిపక్షనాయకుడి హోదాలో... 'చంద్రబాబు నాయుడు' ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. విభజన సమయంలో సమన్యాయం చేయాలని...ఆయన ఢిల్లీలో ధీక్షకు కూర్చున్నారు. అయితే...ఆయన దీక్షకు జాతీయ మీడియా...మద్దతు ఇవ్వలేదు... సరికదా..ఎగతాళి చేసింది. వక్రభాష్యాలు చెబుతూ...'చంద్రబాబు'ను ఆడిపోసుకుంది. సమన్యాయం చేయాలని....'చంద్రబాబు' కోరుతుంటే....'జాతీయమీడియా' మాత్రం...'విభజన'కు వ్యతిరేకమా... అనుకూలమా...చెప్పాలంటూ...పదే పదే ప్రశ్నించి..విసిగించింది. 'చంద్రబాబు'...ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరుతుంటే...జాతీయ మీడియా ఒక ప్రాంతానికి అనుకూలంగా మారి 'చంద్రబాబు'ను పదే పదే అవమానించింది. ఆయనను ఆక్షేపిస్తూ...కథనాలను ప్రసారం చేస్తూ... అవమానాల పాలు చేసింది...!ఇదంతా గతం...!

   కానీ నాలుగేళ్ల తరువాత...అదే జాతీయ మీడియా తన వైఖరిని మార్చుకుంది. 'చంద్రబాబు' వంటి రాజకీయ ఉద్దండుడి..ఇంటర్వ్యూల కోసం క్యూలు కట్టింది. భారతదేశంలోనే అత్యంత బలమైన ప్రధానిని ఢిల్లీ నడిబొడ్డున నిలదీసిన 'చంద్రబాబు' ధైర్యానికి విస్తుపోయి...'సాహో చంద్రబాబు' అంటూ...కీర్తిస్తోంది. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో కానీ...తరువాత..ఆంధ్రాభవన్‌లో జరిగిన సమావేశాల్లో కానీ..'జాతీయ మీడియా' చంద్రబాబు ఇంటర్వ్యూలను ప్రత్యక్ష ప్రసారాలు చేసింది. 'మోడీ'కి వ్యతిరేకంగా...ఢిల్లీ స్థాయిలో...తిరుగుబాటు బావుటా ఎగరేసిన 'చంద్రబాబు' ధైర్యాన్ని కొనియా డుతూనే...ఆయన చెప్పిన మాటలను ఆలకించింది. ఆంధ్రాకు 'మోడీ' చేసిన అన్యాయం గురించి...ఆయన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే...వాటిని కూడా..లైవ్‌ టెలీకాస్ట్‌ చేసింది. ఇక ప్రత్యక్ష ఇంటర్వ్యూలకు అంతే లేదు. పేరు మోసిన ఇంగ్లీషు, హిందీ ఛానెల్స్‌ అన్నీ...ఆయన ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డాయి. మొత్తం మీద నాలుగేళ్ల క్రితం...ఇదే జాతీయ మీడియాతో అవమానాలు పాలైన....'చంద్రబాబు'...మళ్లీ...అదే మీడియాతో..ప్రశంసలు పొందడం...నిజంగా విశేషమనే చెప్పాలి.

'వెంకటేశ్వర్‌' కృషి అద్బుతం...!

జాతీయ మీడియా మొత్తం...ఒక్కసారిగా...'చంద్రబాబు'ను అనుకూలంగా...మారడానికి...వివిధ రాజకీయ కారణాలు, ఇతర కారణాలు ఉన్నా...వారందరినీ...'చంద్రబాబు'ను కలిసే విధంగా....చేసిన కృషి మాత్రం సమాచార కమీషనర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌దే. ముఖ్యమంత్రి 'చంద్రబాబు'కు...జాతీయ మీడియాకు ఆయన అనుసంధానంగా పనిచేసి..అద్బుతమైన కవరేజ్‌ వచ్చేలా కృషి చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఐఎస్‌ అధికారిగా...ఢిల్లీలోనూ...ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేసిన 'వెంకటేశ్వర్‌'కు... అప్పటి అనుభవం ఇప్పుడు బాగా పనికి వచ్చింది. వివిధ జాతీయ ఛానెల్స్‌ విలేకరులతోనూ...పత్రికల్లో సీనియర్‌ స్థానాల్లో ఉన్న జర్నలిస్టులతోనూ...'వెంకటేశ్వర్‌'కు ఉన్న పరిచయాలు ఈ పర్యటన సందర్భంగా ఉపయోగపడ్డాయి. రెండు రోజుల పాటు...విరామం లేకుండా...ఆయన ముఖ్యమంత్రి 'చంద్రబాబు' వెంట ఉంటూ...ఎక్కడా ఫ్రేమ్‌లోకి రాకుండా చేసిన శ్రమను ఇప్పుడు పలువురు జర్నలిస్టులు ప్రశంసిస్తున్నారు. కమీషనర్‌ తన శక్తివంచన లేకుండా...పనిచేశారని...మీడియా పరంగా ఆయన చేసిన కృషి వల్లే...'చంద్రబాబు'కు వ్యతిరేకంగా ఉండే మీడియా సంస్థలు కూడా...చంద్రబాబు ఢిల్లీ పర్యటనను హైలెట్‌ చేశాయి. మొత్తం మీద...'చంద్రబాబు'ను వ్యక్తిగతంగా అభిమానించే...'వెంకటేశ్వర్‌' సరైన సమయంలో సరైన విధంగా...ఢిల్లీ స్థాయిలో ప్రచారాన్ని రాబట్టి...'చంద్రబాబు' అభిమానులను, టిడిపి నాయకులను, కార్యకర్తల అభిమానాన్ని పొందారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

(428)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ