'జగన్' తన గోతిని తానే తవ్వుకుంటున్నాడా...!?

అవును..'జగన్' మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు...! అవసరానికి పనికి వచ్చే వాళ్లను.... ఆదుకునేవాళ్లను...తన నోటి దురదతో మరోసారి దూరం చేసుకుంటున్నాడు.గత ఎన్నికల సమయంలో ఎవరితో పనిలేదు..నేనే దున్నేస్తానని..బొక్కబోర్లాపడినా...'జగన్' మాత్రం తన నైజాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. తాజాగా...నిన్న నిర్వహించిన ప్రెస్మీట్లో...ఆయన వ్యవహారశైలి చూసిన పార్టీ నాయకులే...ఇదెక్కడ వ్యవహారం..అంటూ..గొణుక్కున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత దూషణలు చేస్తూ...చెలరేగిపోయి..తన స్థాయి అదేనని..మరోసారి రుజవు చేసుకున్నారు. 'చంద్రబాబు'ను దూషించిన వైనంపై పెద్దగా పట్టించుకోని...వైకాపా నాయకులు...జనసేన అధ్యక్షుడు 'పవన్కళ్యాణ్'పై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి దాకా...'పవన్' చంద్రబాబును సమర్థించాడు...ఒప్పో...తప్పో...ఇప్పుడు...ఆయనపై ధ్వజమెత్తుతూ...ప్రజల్లో 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అటువంటి ఆయనపై వ్యాఖ్యలు చేయడం వల్ల...పార్టీకి నష్టమే తప్ప లాభం లేదనేది వైకాపా నాయకుల అభిప్రాయం. 'పవన్' సినిమాకు తక్కువ...ఇంటర్వెల్కు ఎక్కువ...అన్న...'జగన్' వ్యాఖ్యలపై...వారు స్పందిస్తూ...'మావోడు...కలసి వచ్చే...అవకాశాలను జారవిడుచుకుపోవడంలో ఎక్స్ఫర్ట్...! 'చంద్రబాబు'కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 'పవన్'పై వ్యాఖ్యానించి...ఈయన ఒరగబెట్టేదేముంది...? వచ్చే ఎన్నికల నాటికి 'చంద్రబాబు' వ్యతిరేకులంతా..ఒకవైపు చేరితే...అంతిమంగా లాభపడేది...తమ పార్టీ...అని...ఆ సంగతి తెలుసుకోకుండా...ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న 'పవన్'ను విమర్శించి...'చంద్రబాబు' వ్యతిరేక ఓటు చీలిపోవడానికి మా నాయకుడే దారి చూపిస్తున్నారు. ఇదేం తెలివో...అర్థం కావడం లేదు..ప్రభుత్వ వ్యతిరేక ఓటు...'జగన్', 'పవన్'ల మధ్య చీలితే...చివరకు... లాభపడేది...'చంద్రబాబే' అన్న సోయి...మావోడి లేదు...ఏం చేస్తాం...అంతా మా ఖర్మ'...అంటూ ఆ నాయకుడు ఆవేశాన్ని వెల్లకక్కాడు.
నిజానికి...తాను అవసరమైతే....వచ్చే ఎన్నికల నాటికి వైకాపాను సమర్థిస్తానను తప్ప...'టిడిపి'వైపు ఉండనని 'పవన్' ఘంటాపథంగా చెప్పిన తరువాత....కూడా 'జగన్' 'పవన్'పై వ్యాఖ్యలు చేసి...సెల్ప్గోల్ వేసుకున్నారని..పార్టీ నాయకులు మొత్తుకుంటున్నారు. మరి అప్పుడెప్పుడో..లక్ష కోట్లు...తిన్నాడని...తండ్రి ముఖ్యమంత్రి అయితే....కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలా...? అని ప్రశ్నించిన 'పవన్'పై కోపం చల్లారకే...'జగన్' అసహనాన్ని ప్రదర్శించారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా...'చంద్రబాబు' వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిపోకుండా... ఉండాలని 'ఉండవల్లి, ఐవైఆర్ కృష్ణారావు, సిపిఎం మధు వంటి నాయకులు చేస్తోన్న ప్రయత్నాలకు స్వయంగా 'జగనే' గండికొడుతున్నారని...ఇటువంటి నాయకున్ని నమ్ముకుంటే...తాము అనుకున్నది సాధించలేమనే అభిప్రాయం...'జగన్'ను సమర్థిస్తోన్న హైదరాబాద్ మేధావుల్లో వ్యక్తం అవుతోంది.