WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆల్‌ ఆర్‌ రెడ్డీస్‌ హియర్‌...!?

ప్రత్యేకహోదా కోసం...ఢిల్లీలో ధర్నా చేస్తోన్న వైకాపా ఎంపీలకు 'ఎన్సీపీ' ఎంపీ షాక్‌ ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ఎంపీ ధీక్ష చేస్తోన్న...వైకాపా ఎంపీల శిబిరానికి వచ్చి వారిని పరామర్శించి..మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న ఎంపీల పేర్లు తెలుసుకుని...'ఆల్‌ ఆర్‌ రెడ్డీస్‌ హియర్‌...! మీ రాష్ట్రంలో 97 శాతం మంది రెడ్డి జనాభా ఉన్నట్లు ఉంది...ఇక్కడ ఉన్న మీ ఎంపీలను చూస్తుంటే...అనడంతో..ఒక్కసారిగా వైకాపా ఎంపీలందరూ షాక్‌ తిన్నారు. తమ రాష్ట్రంలో 'రెడ్డి' కులస్తులు..కేవలం 6శాతం మాత్రమే ఉన్నారని ఓ ఎమ్మెల్యే చెప్పగా...అక్కడ ఉన్న ఎంపీల పేర్లను ఆయన వరుసగా చదివారట. వారిలో 'మిధున్‌రెడ్డి, సుబ్బారెడ్డి,మేకపాటిమోహన్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలు ఎంపీలుగా ఉన్నారు. కేవలం 'వరప్రసాద్‌' ఒక్కరు మాత్రమే...వేరే కులానికి చెందిన వ్యక్తి...అందుకే...ఆ ఎంపీ...'ఆల్‌ ఆర్‌ రెడ్డీస్‌ హియర్‌' అని వ్యాఖ్యానించారని చెప్పారట. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది...'జగన్‌' పార్టీలో ఉన్న వారిలో దాదాపు 70శాతం మంది..వాళ్ల కదా...అని పార్టీలోని ఇతర కులస్తులు గొణుక్కుంటున్నారట.  ఎంతైనా..తమకు సంఘీభావం చెబుతారని...ఆయనను తెచ్చుకుంటే...ఆయనేంటి...మన పరువు తీసిపోయారని...ఎంపీలు తీరిగ్గా విచారిస్తున్నారట.


(280)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ