WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆదాల'పై మంత్రి సోమిరెడ్డి దుప్రృచారం...!?

మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి టిడిపిని వీడి వైకాపాలో చేరబోతున్నారని జరుగుతున్న దుష్రృచారం వెనుక మంత్రి సోమిరెడ్డి మరియు ఆయన అనుచరుల హస్తం ఉందని 'ఆదాల' అనుచరులు ఆరోపిస్తున్నారు. బాహాటంగా ఆఫ్‌ ది రికార్డుగా సోమిరెడ్డి వ్యవహారశైలిని దుయ్యబడుతున్నారు. 2004 ఎన్నికలకు ముందు ఇదే విధంగా దుప్రృచారం చేసి 'ఆదాల'ను పార్టీని వీడేటట్లు చేసిన ఘనత 'సోమిరెడ్డి'కి ఉంది. అప్పట్లో 'చంద్రబాబు'ను స్వయంగా కలసి 'ఆదాల' విన్నవించినప్పటికీ..ఆయన కనీసం 'సోమిరెడ్డి'ని మందలించకపోవడంతో 'ఆదాల' టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని అప్పట్లో 'సోమిరెడ్డి' చేసిన సవాల్‌ను అంగీకరించి ఆయనపై పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించారు 'ఆదాల'. 2009 ఎన్నికల్లో కూడా 'సోమిరెడ్డి'ని ఓడించారు 'ఆదాల'. 2014 ఎన్నికలకు ముందు...ఆదాలను పార్టీలోకి ఆహ్వానించి సముచితస్థానం కల్పిస్తానని 'జగన్‌' స్వయంగా పిలిచి హామీ ఇచ్చారు. కానీ...'చంద్రబాబు' పిలుపుమేరకు టిడిపిలో చేరి నెల్లూరు ఎంపీగా దగ్గర బంధువుపై పోటీ చేసి కేవలం 9వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. గతంలో 'ఆదాల'పై రెండుసార్లు ఓడిపోయిన మంత్రి సోమిరెడ్డి మూడవసారి వైకాపా అభ్యర్థి 'గోవర్థన్‌రెడ్డి'పై పోటీ చేసి ఓడిపోయి...హ్యాటిక్‌ ఓటమి వీరునిగా పేరు తెచ్చుకున్నారు. 

   2004లో ఏవిధమైన వాతావరణాన్ని 'సోమిరెడ్డి' కల్పించారో...మళ్లీ ఇప్పుడు అదే వాతావరణాన్ని 'సోమిరెడ్డి' కల్పిస్తున్నారని...ఆదాల చెబుతున్నారు. టిడిపిని వీడే ప్రసక్తేలేదని...తనపై కొందరు ప్రచారం చేసినా...తాను పట్టించుకోనని..'ఆదాల' మీడియా వర్గాలకు తెలిపారు. ఒక్కసారి చేదు అనుభవం ఎదురైనప్పటికీ...మళ్లీ అదే అనుభవాన్ని కోరుకుంటున్నారు మంత్రి సోమిరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు. మూడుసార్లు ఓడిపోయిన 'సోమిరెడ్డి'కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారని...కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన 'ఆదాల'కు ఎటువంటి పదవులు ఇవ్వడం లేదని ఆయన అనచురులు అంటున్నారు. ఏదో విధంగా 'ఆదాల'ను పార్టీలోకి చేర్చుకుని..టిడిపిని దెబ్బకొట్టాలని 'జగన్‌' ప్రయత్నాలు చేస్తున్నారట. తన రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టి టిడిపిలో చేరి కోట్లు ఖర్చుచేసి ఎన్నికల్లో ఓడిపోయినా..పార్టీకి విధేయంగా ఉంటానని..అధినేత చంద్రబాబుపై ఎటువంటి విమర్శలు చేయలేదని...తననెందుకు ఆయన చిన్నచూపు చూస్తున్నారు..తనకు పదవులు ఇచ్చినా..ఇవ్వకపోయినా పట్టించుకోను..పార్టీ నుండి బయటకు పంపించమంటే పంపించండి...తనంత తాను పార్టీని వీడే ప్రసక్తేలేదని...ఆదాల చెబుతున్నారు. మరి కొద్ది నెలల్లో ఈ ఎపిసోడ్‌కు ముగింపు పలకబోతోంది. అది ఏ విధంగా ఉంటుందో...ఏ ఒక్కరూ చెప్పలేరన్నది వాస్తవం.

(169)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ