WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డెల్టా టైగర్‌ మళ్లీ గెలుస్తారా...!?

తెలుగుయువత నాయకునిగా పార్టీలో చేరి మూడు సార్లు విజయం సాధించి...రెండుసార్లు ఓడిపోయిన..మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మళ్లీ తెనాలిలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించగలరా..? అనే అనుమానం స్వపక్షం నుంచే వ్యక్తం అవుతోంది. 'ఆలపాటి'ని డెల్టాటైగర్‌గా వర్ణిస్తుంటారు. స్వంత ఛానెల్‌లోనూ..వాల్‌పోస్టర్లలోనూ...ఇతరత్రా విషయాల్లో డెల్టాటైగర్‌ ఆలపాటి అని ప్రచురిస్తున్నారు...చెప్పుకుంటున్నారు. డెల్టా టైగర్‌ బిరుదును ఎవరు ఇచ్చారు...'ఆలపాటి' ఏమి సాధించారని...ఆయనను ఆ పేరుతో పిలుస్తుంటే...'ఆలపాటి' ఎందుకు మౌనంగా ఉంటున్నారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణతో ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఇంతకు ముందే విమర్శలు ఉన్నాయి. భూ వివాదాల్లో తలదూర్చడం, ఇతర విషయాల్లో సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తెనాలి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో విజయం సాధించిన ఆయన క్రమం క్రమంగా పట్టుకోల్పోతున్నారు. 

  తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు విలువ కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ నాలుగేళ్లల్లో...వివాద భూముల పరిష్కారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని...విపక్షాల నాయకులు బాహాటంగా ఆరోపణలు చేశారు...స్వపక్షీయులు... పరోక్షంగా అంగీకరిస్తున్నారు. డైల్టా టైగర్‌ అంటే భూ వివాదాల్లో తలదూర్చడమా...? పరిటాల రవి లాంటి నాయకుడ్నే..ఎవరూ టైగర్‌ అని పిలవలేదు. ప్రజల్లో పట్టున్న...కరణం బలరాం, కోడెల శివప్రసాద్‌ వంటి నాయకులు కూడా అటువంటి పేర్లతో...పిలిపించుకోలేదు. ఎవరైనా పిలిచినా...వారిని మందలించేవారు. మరి 'ఆలపాటి' ఎందుకు ఆ విధంగా పిలిపించుకుంటున్నారో...? స్వంత ఛానెల్‌లో ...బాకాలు ఊదుకుంటూ...రోజులు గడుపుతున్న...ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రి పదవి ఇచ్చినా...ఇవ్వకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబును ఎటువంటి విమర్శలు చేయలేదు. తన కంటే జూనియర్‌ అయిన మంత్రి పుల్లారావుకు మంత్రి పదవి ఇచ్చి కొనసాగించినా...ఆయన ఎటువంటి ఆరోపణలు చేయడం లేదని...ఇదే ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ అని కొందరు చెబుతున్నారు. డెల్టా టైగర్‌గా పిలిపించుకుంటున్న 'ఆలపాటి' వచ్చే ఎన్నికల్లో...విజయం సాధించి ఆ పేరును సార్థకం చేసుకుంటారో...లేదో..చూడాలి.

(జి.ఎస్‌.రావు) (గుంటూరు)

(227)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ