WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపి వ్యతిరేకులను...ధీటుగా ఎదుర్కొంటున్న టిడిపి సానుభూతిపరులు...!

తెలుగుదేశం ప్రభుత్వంపై జనసేన అధినేత 'పవన్‌కళ్యాణ్‌' విమర్శలు, ఆరోపణలు చేసిన అనంతరం సోషల్‌మీడియాలో ఆయన అభిమానులు చేసిన ప్రచారానికి ధీటుగా స్పందించలేకపోయారు...టిడిపి అభిమానులు. తరువాత ఎన్‌డిఎ ప్రభుత్వంతో 'చంద్రబాబు' తెగతెంపులు చేసుకుని...పార్టీకి చెందిన కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడం..ఆ తరువాత సోషల్‌మీడియాలో జరిగిన ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో ఆయన ఏర్పాటు చేసుకున్న 'సోషల్‌మీడియా' విభాగంతో సంబంధం లేకుండా...గత 30సంవత్సరాలుగా టిడిపికి సానుభూతిపరులుగా ఉన్న కొందరు నాయకులు, కార్యకర్తలు..సోషల్‌ మీడియాలో అనుకూల ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల పరిధిలో గ్రామాలకు చెందిన సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తమంతట తామే తెరపైకి వచ్చారు. ధీటుగా స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. దీంతో వైకాపా, బిజెపి, జనసేన అభిమానులు..షాక్‌కు గురయ్యారు. తమ ప్రచారం దీటుగా 'చంద్రబాబు' ఎదుర్కొంటున్నారని నమ్మిన వీరికి ఇందులో ఆయనకు సంబంధం లేదని, టిడిపికి చెందిన సానుభూతి పరులే...స్వయంగా స్పందించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారని తెలుసుకున్నారు. కోట్ల రూపాయలు చెల్లిస్తూ...ఏర్పాటు చేసుకున్న సోషల్‌మీడియా చతికిలపడిపోయింది...ఆ విభాగంలో పనిచేస్తోన్నవారిలో ఎక్కువ మందికి తెలుగు రాదు..వచ్చినా...వారు మొక్కుబడిగా స్పందిస్తున్నారు. తాము అభిమానిస్తున్న టిడిపిపై జరుగుతున్న ప్రచారాన్ని భరించలేకపోయిన...వారు...పార్టీ కోసం అహర్నిశలు కష్టపడింది వారే....స్వంత సొమ్మును ఖర్చుపెట్టి...అభ్యర్థులను గెలిపించిదీ వారే. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా...తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా...బెదిరించినా..తొణకకుండా...బెణకుండా..అభ్యర్థుల గెలుపే తమ గెలుపుగా భావించి...అనేక గ్రామాల్లో ఓట్లు వేయించారో..వాళ్లే మళ్లీ తెరపైకి వచ్చి...సోషల్‌మీడియాలోనూ...ఇతరత్రా పద్దతుల ద్వారా ధీటుగా స్పందిస్తున్నారు. విమర్శలకు, ఆరోపణలకు ధీటుగా జవాబులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో టిడిపిదే పైచేయి కావడంలో అటువంటి వారి కృషి ఎంతో ఉందని మీడియా వర్గాలకు తెలుసు..కానీ 'చంద్రబాబు'కు తెలుసో లేదో..ఎవరైనా చెప్పారో..లేదో తెలియదు. పలు గ్రామాల్లో ఈతరం పార్టీ నేతలుగా చెలమణి అవుతున్న వారు వైకాపా నాయకులతో కలసి వ్యాపారాలు చేసుకుంటున్నారు..నీకింత..నాకింత అని కాంట్రాక్టులు పంచుకుంటున్నారు. అటువంటివారినే...ఎమ్మెల్యేలు, నాయకులు చేరదీస్తున్నారు తప్ప...ముప్పయి సంవత్సరాలుగా సానుభూతి పరులుగా ఉన్నవారిని ఆదరించడం కానీ...కనీసం పలకరించడం లేదనే విమర్శలు ఎక్కువ మంది నుంచి వస్తున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది తాము చూడమని...ముప్పయి సంవత్సరాలు పోరాడామని..ఓపిక ఉంటే..మరో ఇరవై ఏళ్లు పోరాటం చేస్తాం...ఈతరం నేతలు..కుమ్మక్కు అయినట్లు తాము కుమ్మక్కు కామని..పాతరం నాయకులు చెబుతున్నారు. చిత్రవిచిత్రమైన విషయం ఏమిటంటే...టిడిపిపై, చంద్రబాబుపై విమర్శలు వస్తున్నా...ఈతరం నాయకులు మౌనం వహిస్తూ..వైకాపా స్థానిక నాయకులతో అనేక విషయాల్లో కలసిమెలసి జల్సా చేస్తున్నారని..ఈ విషయం తెలుసుకోవాలని గ్రామాల సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ధీటుగా స్పందిస్తున్న వారి వివరాలు తెలుసుకున్న మీడియా వర్గాలు..వారితో ఫోన్‌లో మాట్లాడగా..వారు చెప్పిన సమాధానం ఎంత నిజాయితీగా ఉందో స్పష్టం అవుతోంది. ఆ సమాధానం ఏమిటంటే...మా తండ్రులు, తాతలు..కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికల్లో గెలిచినా..ఓడినా...తాము కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పనిచేశాం..మా తండ్రులు, తాతలు ఎప్పుడూ ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. మాకు కాలం కలసి వచ్చి ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి మా ఆశలకు రూపం ఇచ్చారు...గ్రామాల్లో తాము తలెత్తుకునే విధంగా చేశారు..ఆ కృతజ్ఞతాభావంతో 'చంద్రబాబు'పై ఇష్టం ఉన్నా లేకున్నా... మావంతుగా సోషల్‌మీడియాలో స్పందిస్తున్నాం...ఇప్పటికీ స్వంత సొమ్మునే ఖర్చుపెట్టుకున్నామంటున్నారు. ఈ అనుభవాలను పలు గ్రామాల్లో 'జనంప్రత్యేకప్రతినిధి'కి ఎదురైంది. అనేకమంది నాయకులతో 'జనంప్రత్యేకప్రతినిధి'తో మాట్లాడినప్పుడు..వారు 30ఏళ్లల్లో పోగొట్టుకున్నదెంతో..అధికారంలో లేనప్పుడు ఇబ్బందులు పడిందెంతో..చెబుతుంటే...ఈతరం నాయకులుగా చెలామణి అవుతున్న వారిని ఛీ కొట్టాలనిపించింది. అటువంటి కమిటెమెంట్‌ ఉన్న నాయకులు మళ్లీ తెరపైకి రాలేదన్నది వాస్తవం..ఇప్పటికైనా ఈతరం నాయకులుగా చెలామణి అవుతున్నవారు పాతతరం నాయకులను ఆదర్శంగా తీసుకుని విపక్షాలతో కుమ్మక్కు కాకుండా లాభాపేక్ష లేకుండా రాజకీయాలు చేయగలిగితే...ముందుకెళ్ల గలితే..చరిత్రహీనలు కావడం ఖాయం.

(బి.ఆర్‌.కె.మూర్తి)

(253)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ