WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కంప్యూటర్ ఆపరేటర్ పై లైంగిక వేధింపులు

ఇంటికొచ్చి పని చేయాలంటూ వత్తిడి

లేకుంటే ఉద్యోగం నుండి తొలగిస్తానంటూ బెదిరింపులు

ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి

కర్నూల్, ఏప్రిల్ 8 (జనం ప్రతినిధి) కంప్యూటర్ ఆపరేటర్ పై కన్నేసిన ఇంజనీరు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనే ప్రయత్నం ఆలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని గృహనిర్మాణ శాఖలో ఏ.ఇ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఆస్పరి మండలం అదే శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వివాహితపై కన్నేశాడు. అయితే కంప్యూటర్ కార్యాలయంలో ఉంటే తనకోరిక నెరవేరదనే ఆలోచనతో ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ను తన యింటికి తీసుకెళ్లాడు. ఏప్రిల్ 6వ తేదీన సదరు మహిళ యధావిధిగా విధులకు వెళ్లగా ఆఫీసులో తాను పనిచేస్తున్న కంప్యూటర్ కనిపించలేదు. ఆవిషయమై ఆరా తీయగా సదరు ఇంజనీరు యింటికి తీసుకెళ్లాడని తెలిసింది. ఇదేమిటని ఆ మహిళ ప్రశ్నించగా ఇంటికొచ్చి పని చేయాలంటూ ఆమెను బలవంతం చేసినట్లు తెలిసింది. దీంతో ఆమె తన ఉద్యోగాన్ని వదులుకోవటానికి సిద్దపడిందని సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయనటానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణలని చెప్పుకోవచ్చు. కార్యాలయాల్లో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్న విషయం తెలిసినా సంబంధిత శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు.

(మహిళా ఉద్యోగి గోడు వినండి) https://www.youtube.com/embed/AbLniwMpipc 

(567)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ