లేటెస్ట్

హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదు

కోవిడ్-19కు వ్య‌తిరేకంగా భార‌త్ ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించ‌లేద‌ని డాక్ట‌ర్ వి.కె.పాల్ అన్నారు. కోవిడ్ కు వ్య‌తిరేకంగా పోరాటంలో రాబోయే 125 రోజులు చాలా కీల‌క‌మ‌ని, ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. హెర్డ్ ఇమ్యూనిటీని ఇంకా సాధించలేద‌ని, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయ‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం శుక్ర‌వారం తెలిపింది. 


ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో  నీతి ఆయోగ్ సభ్యుడు  డాక్టర్ వికె పాల్ మాట్లాడుతూ, సంక్రమణను ఇప్పుడు వ్యాప్తి చెందకుండా ఆపాలి మరియు కోవిడ్ తో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా అది సాధ్యం అవుతుంద‌ని అన్నారు.  మ‌నం ఇంకా కోవిడ్ -19 కి వ్యతిరేకంగా హెర్డ్ ఇమ్యూనిటీ ద‌శ‌కు చేరుకోలేదు.  వైరల్ వేరియంట్స్ వివిధ ర‌కాలుగా వ్యాపిస్తోంది. దాన్ని ఇప్పుడు మ‌నం ఆపాలి. కోవిద్ నియ‌మాల‌ను పాటిస్తూ జాగ్ర‌త్త‌గా ఉంటే అది సాధ్యం అవుతుంది అని   డాక్టర్ పాల్  అన్నారు. కోవిడ్ -19 తో జరిగిన పోరాటంలో రాబోయే 125 రోజులు భారతదేశానికి చాలా క్లిష్టమైనవి అని ఆయ‌న‌ అన్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ