లేటెస్ట్

మంత్రి మాట వినని ఐఎఎస్‌...!

గత ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలని, అధికారం అంతా 'చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌' మాత్రమే చెలాయించారని పదే పదే అప్పటి ప్రతిపక్షనాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంత్రులను డమ్మీలను 'చంద్రబాబు, ఆయన సామాజికవర్గ నాయకులు..పెత్తనం చేశారని, తాము అధికారంలోకి వస్తే..మంత్రులదే అధికారమని వై.ఎస్‌.జగన్‌ చెప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కూడా ఆయన ఇదే మాట బహిరంగంగానే చెప్పారు. తమ శాఖ పరిధిలో అధికారం మొత్తం సదరు మంత్రిదేనని, మంత్రి మాట అధికారులు ఇవ్వాల్సిందేనని ఖరాఖండిగా చెప్పారు. దీంతో..మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖాలువెలిగిపోయాయి. అయితే ఆ సంబడం ఆదిలోనే ఆవిరయింది. 'జగన్‌' క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న పలువురు మంత్రులను మాటలను అధికారులు లెక్కచేయడం లేదని ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రులు..నామ మాత్రంగా అయిపోయారని అంటున్నారు. అధికార అనుభవం లేని నూతన మంత్రులు తమ శాఖలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. అసలు శాఖలో తామేమి చేయాలో...ఏ విధంగా వ్యవహరించాలో తెలియకపోవడంతో..అధికారులు...ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొదటి సారి మంత్రులు అయిన పలువురు మంత్రులను అధికారులు తీసిపడేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బలహీనవర్గాలకు చెందిన మంత్రుల మాటలను అధికారులు లెక్క చేయడం లేదు. 

తాజాగా అతి ప్రాధాన్యమైన శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న నాయకుని మాటను ఆశాఖ అధికారి లక్ష్యపెట్టడం లేదట. నీకేం తెలియదు అన్నట్లువ్యవహరిస్తున్నారట. సదరు మంత్రి ఉన్నత విద్యావంతుడు అయినా...కూడా సదరు ఐఎఎస్‌ మంత్రిదేముందన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సదరు ఐఎఎస్‌ అధికారి తన మాట ఎందుకు వినడంలో తెలియక మంత్రిగారు...మల్లగుల్లాలు పడుతున్నారట. అయితే సదరు ఐఎఎస్‌ ఎందుకు మంత్రి మాట వినడం లేదో ఆరా తీస్తే..దాని వెనుక ఉన్న మతలబు బయటపడింది. సదరు ఐఎఎస్‌ మంత్రి మాటను లెక్కచేయకపోవడంవెనుక...ముఖ్య అధికారి పాత్ర ఉందట. సదరు ఐఎఎస్‌కు ఆయనే పోస్టింగ్‌ ఇప్పించారట. ఒకే సామాజికవర్గానికి చెందిన వీరిద్దరికి..ఓ పెద్ద కాంట్రాక్టర్‌ అండ ఉందట. మీడియా రంగంతో సంబంధం ఉన్న సదరు కాంట్రాక్టర్‌ ఎన్నికలకు ముందు వైకాపాకు ఆర్థిక సహాయం చేశారట. దీంతో..ఇప్పుడు ఆ కాంట్రాక్టర్‌, ముఖ్య అధికారి అండతో సదరు ఐఎఎస్‌ రెచ్చిపోతున్నారట. వారిద్దరి అండ ఉండగా మంత్రి తననేమి చేస్తారని, ఆయన మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. ఈ విషయం తెలియని సదరు మంత్రి..ఇంకా ఎందుకు ఆ ఐఎఎస్‌ తన మాట వినడం లేదో తెలుసుకునే పనిలోనే ఉన్నారట. మంత్రిగారు ఆలోచనలో ఉండగానే...సదరు ఐఎఎస్‌, పుస్తకరంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సదరు కాంట్రాక్టర్‌ ఆ శాఖను భ్రష్టుపట్టిస్తారని మంత్రి అనుచరులు, ఆశాఖకు సంబంధించిన అధికారులు వాపోతున్నారు. మరి మంత్రి ఇప్పటికైనా మేల్కొంటారా..? లేదా..ఇంకా ఆలోచనలతోనే కాలం గడుపుతారా..? చూద్దాం..ఏమి జరుగుతుందో..? 

(624)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ