WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చంద్రబాబు అవినీతిలో 'కలెక్టర్ల'కూ భాగస్వామ్యం:జగన్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తోన్న అవినీతిలో జిల్లా కలెక్టర్లకూ భాగస్వామ్యం ఉందని ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని, అవినీతిలో 'చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, ప్రధాన కార్యదర్శులు, చివరకు జిల్లా కలెక్టర్లకూ భాగస్వామ్యం ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఆదర్శవంతంగా ఉండాల్సిన జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రితో కలసి దోచుకుంటున్నారని, ఇది దోపిడీ రాజ్యమని...ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి జి.ఒ.నెం.22 తల్లిలాంటిదని, సిఎం చంద్రబాబు అవినీతి డాన్‌లా వ్యవహరిస్తుంటే...ఆయనకు జిల్లా కలెక్టర్లు సహకరిస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియాను ముఖ్యమంత్రి పెంచిపోషిస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఇసుక దోపిడీలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. 

   పలు ఇసుక రీచ్‌లో అధునాతన యంత్రాలతో ఇసుకను తవ్వి తీసుకుపోతుంటే...దాన్ని అరికట్టాల్సిన కలెక్టర్లు వారితో కుమ్మక్కు అయి..దోచుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఉద్దండరాయునిపాలెం, పెనుమాక, లింగాయపాలెం, మున్నంగి, కొల్లిపర ఇసుక రీచ్‌లో దోపిడీ యధేచ్చగా సాగుతుందని ఆరోపించారు. ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు పనులను తమకు కావాల్సిన వారికి నామినేషన్‌ ప్రాతిపదికన ఇస్తున్నారని, దీనికి కలెక్టర్లు సహకరిస్తు న్నారని...వీరి దోపిడికి రాష్ట్ర ప్రజలు బలి అవుతున్నారని...'జగన్‌' వ్యాఖ్యానించారు. ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తూ..కలెక్టర్లు దోచుకుంటున్నారని  ఘాటుగా విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి పాల్పడిన వారందరినీ శిక్షిస్తామని 'జగన్‌' చెప్పారు. మొత్తం మీద లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటూ...ఆరు నెలలు జైలు జీవితం గడిపి..బెయిల్‌పై బయటఉన్న 'జగన్‌' జిల్లా కలెక్టర్లపై అవినీతి ఆరోపణలు చేయడం విశేషం.


(265)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ