WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పంచాయితీరాజ్‌శాఖలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయిస్తారా...?

పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖాధిపతి 'జవహర్‌రెడ్డి' పేరుతో కొందరు మధ్యవర్తులు అందిన వరకు దోచుకున్నారని, కేవలం కొన్ని పనులు మాత్రమే చేయించి...లక్షలు తీసుకున్న అడ్వాన్స్‌ సొమ్ములతో ఒకరు పరారు కాగా...ఇంకొకరు...సచివాలయంలోనే కనిపిస్తున్నారని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన విదితమే. ఈ విషయంపై ఇంకా కొంత మంది బాదితులు స్పందిస్తూ...దీనిపై విచారణ జరపాలని కోరుతున్నారు. విచారణలో అసలైన నిజాలు బయటకు వస్తాయని వారు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న 'సుబ్రహ్మణ్యం'పై విచారణ జరిపిస్తే...అసలైన వాస్తవాలు బయటకు వస్తాయని...ఆయనపై వస్తోన్న ఆరోపణల దృష్ట్యా..వెంటనే అతనిపై విచారణ చేయించాలని కొందరు బాధితులు కోరుతున్నారు. మధ్యవర్తులుగా చెప్పుకుంటున్న 'సుబ్రహ్మణ్యం, పురుషోత్తంరెడ్డిలు 'జవహర్‌రెడ్డి' కార్యాలయంలో గంటలు గంటలు కూర్చున్న నిజం. వారిని చూసే...కొంత మంది అడ్వాన్స్‌లు చెల్లించింది నిజం. వారికి 'జవహర్‌రెడ్డి' అంత చనువు ఇవ్వాల్సిన అవసరం ఏముంది..? ఏసీబీ కేసులో ఇరుక్కున్న డిపిఒ శ్రీధర్‌రెడ్డి తిరిగి తనకు పోస్టింగ్‌కు ఇప్పించేందుకు రూ.50లక్షలు ఖర్చు పెట్టారని...ఈ విషయం అప్పటి పంచాయితీరాజ్‌ మంత్రికి కూడా తెలుసనని బాధితులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఒకరు 'జవహర్‌రెడ్డి' కార్యాలయంలో గంటలు గంటలు ఎందుకు కూర్చుంటున్నారు. 

  'చంద్రబాబు'ను వ్యతిరేకించే...మాజీ ఎమ్మెల్సీ 'జవహర్‌రెడ్డి' కార్యాలయంలో ఎందుకు తిరుగుతున్నారు...? అంతే కాకుండా టిడిపి ఎమ్మెల్సీ జనార్దన్‌...'జవహర్‌రెడ్డి'తో ఎన్ని పనులు చక్కపెట్టుకోలేదు..? ఎంత మందికి నిధులు ఇప్పించలేదు..'చినబాబు'ను ఒప్పించి...గ్రామీణాభి వృద్ధిశాఖను 'జవహర్‌రెడ్డి'కి అప్పగించింది...'జనార్థన్‌' కాదా..? ఈ మొత్తం వ్యవహారంలో అమాయకుడు మంత్రి నారా లోకేషేనని...ఆయన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని...వీరందరూ ఆయనను ఆడిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపిస్తే..అన్ని నిజాలు బయటకు వస్తాయని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'కు పలువురు బాధితులు చెబుతున్నారు. కాగా...'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'లో వచ్చిన కథనాన్ని చదివిన ఒక అధికారి దీనిపై స్పందిస్తూ...పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిలో జరుగుతున్న అక్రమాలపై నిజాలు చెప్పడానికి తాను ముందుకు వస్తానని..విచారణ ఎప్పుడు జరిగితే...అప్పుడు అసలైన వాస్తవాలను విచారణ కమిటీకి తెలియజేస్తానని..అటువంటి కమిటీ వేయాలని ఆయన కోరుతున్నారు. అసలు పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో ఎన్ని పైళ్లు వచ్చాయి..వాటిలో ఎన్ని పరిష్కారానికి నోచుకున్నాయి..? ఎన్ని పరిష్కారానికి నోచుకోలేదు..అనే దానిపై విచారణ జరిపిస్తే...వాస్తవాలన్నీ బయటకు వస్తాయని...వారు అంటున్నారు. మరి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందా..? అవినీతిపరులపై చర్య తీసుకునే దమ్ము 'చంద్రబాబు'కు ఉందా..? ఏం జరుగుతుందో....వేచి చూద్దాం..!

(180)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ