WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లింకేజీ రుణాల్లో 'కృష్ణా' హ్యాట్రిక్‌...!

కృష్ణా జిల్లా మరో అరుదైన ఘనతను సాధించింది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ రుణాల పంపిణీలో హ్యాట్రిక్‌ సాధించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే బ్యాంక్‌ లింకేజీ రుణాల్లో వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. 2015-16 సంవత్సరంలో రూ.1206 కోట్లు, 2016-17లో రూ.1390కోట్లు, 2017-18లో 1549 కోట్లు లింకేజీ రుణాలు అందించి కృష్ణా జిల్లా సత్తా చాటింది. కలెక్టర్‌ లక్ష్మీకాంతం చొరవతో...వరుసగా మూడుసార్లు ఈ ఘనతను సాధించింది. గత రికార్డులను బ్రేక్‌ చేస్తూ...భారతదేశంలో ఎవరూ సాధించని స్థానాన్ని సంపాదించి...సగర్వంగా నిలిచింది. దీనికి గాను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి.చంద్రశేఖర్‌రాజు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ముఖ్య కార్య నిర్వహణాధికారి కృష్ణమోహన్‌ చేతులు మీదుగా అవార్దు తీసుకున్నారు. మొత్తం మూడేళ్లలో రూ.2,811కోట్ల మేర లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా...మొత్తం రూ.4,145కోట్లు రుణాలు ఇచ్చి కృష్ణా జిల్లా రికార్డు సృష్టించింది. పెద్ద స్థాయిలో పంపిణీ చేసిన రుణాలను సభ్యులు దుర్వినియోగం కాకుండా...ఆదాయం సమకూర్చుకోవడానికి వాడుకుని అభివృద్ధి పథంలో నడవాలని పీడీ చంద్రశేఖరరాజు వారిని కోరారు. 

(154)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ