WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంచినీరు కలుషితమైతే ఉపేక్షించేది లేదు:కలెక్టర్ కోన శశిధర్

జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా మంచినీరు కలుషితమైతే ఉపేక్షించేది లేదని, ముందస్తు గానే ఆన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు.  నేటి సాయంత్రం కలెక్టరు క్యాంపు కార్యాలయ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్.డబ్లు.యస్ అధికారులు,తహశిల్డార్లు, యం.పి.డి.వో లు, పంచాయితీ కార్యదర్శులతో సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షిం చారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ మండల ప్రధాన కేంద్రం తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో  ఎక్కడ కూడా మంచి నీటి పైప్ లైన్లు డ్రైనేజ్  కాలువల క్రిందకు ఉండటానికి వీల్లేదని అటు వంటివి ఉంటే తక్షణమే మార్చి వేయాలని ఖర్చుకు వెనకాడకుండా ఎంత ఖర్చయినా మార్చాలని కోరారు.   మెయిన్ పైపు లైన్ నుండి గృహాలకు కిచ్చే పైప్ లైన్ డ్రైనేజ్ కాలువ క్రింద ఉన్నా దాన్ని వెంటనే డ్రైనేజ్ కాలువకు పై నుండి యుద్ద ప్రాతిపదికన మార్చాలన్నారు.  దాచేపల్లి మండలం నారాయణపురం లో జరిగిన సంఘటన ప్రాంతానికి  అధికారులు  వెళ్లి వివరాలు సేకరించాలని అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించిన  కలెక్టర్, ఘటన వివరాలకు అనుగుణంగా పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని  కోరారు.  జాయింట్ కలెక్టర్, డి.పి.వో,  డి.యం.అండ్ హెచ్. ఓ తదితర అధికారులకు కలెక్టర్ ఆదేశాలివ్వడంతో వారు సంఘటన స్థలానికి వెళ్ళి తక్షణమే చర్యలు చేపట్టి కలెక్టర్ కు వివరాలు తెలియజేసారు.

          జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఎలా జరుగుతోంది, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా, డ్రైనేజి తో మంచి నీటి పైపులు కలిసి ఉన్నాయా, సురక్షిత మంచినీటి సరఫరా కు సంబందించిన ఫిల్టర్ షేడ్స్ ఎలా ఉన్నాయి ఈ వేసవికి నీరు సరిపోతాయా, చాలకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే విషయాల పై సలహాలు, సూచనలను అధికారులకు కలెక్టర్ తెలియజేసారు.  నీరు కలుషితమై జిల్లాలో ఎక్కడయినా సంఘటనలు జరిగితే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.  పని విషయంలో అలసత్యం వహించిన చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామ కార్యదర్శి క్రాంతికర్ ను  కలెక్టరు సస్పెండ్ చేసారు.  ప్రతి గ్రామాన్ని ఆర్.డబ్లు.యస్, తహశీల్డార్లు, యం.డి.వో లు, సంబంధిత అధికారులు తిరిగి పైపు లైన్లను క్షుణంగా పరిశీలించాలని, సమస్య వున్న చోట్ల పైపు లైన్లను మార్చివేసెందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామాన్ని సందర్శించినపుడు స్థానిక సర్పంచ్ ను, జన్మభూమి కమిటీలను కలిసి సమస్య ఎక్కడ వుందో అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ అన్నారు.  సమస్య వున్న చోట మూడు రోజుల్లో పైపులు మార్చాలని కోరారు.  జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని డి.ఆర్.ఓ ను కోరారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సమస్య వున్న చోట పైపు లైన్లు మార్చేందుకు స్పెషల్ డ్రైవ్ ద్వారా పనులు చేపట్టాలని, మంచినీటి ట్యాంక్ లలో క్లోరినేషన్ ద్వారా స్వచ్చమైన త్రాగు నీరును ప్రజలకు అందించాలని, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న మనం ఎక్కడా అలసత్వం వహించడానికి వీలులేదని, జరగకూడని  సంఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై తీవ్రమైన చర్యలుంటాయని ఆ పరిస్థితులు తెచ్చుకోకుండ పనులు చేపట్టాలని కలెక్టరు కోరారు.ఈ  సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.యండి.ఇంతియాజ్, జిల్లా రెవిన్యూ అధికారి కె.నాగబాబు, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.  

(41)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ