WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్‌...!

రెండోసారి ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా 'జూపూడి'...!

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భర్తీ చేశారు.  అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ ఛైర్మన్‌ పదవిని అనుకున్నట్లే...పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆయన టిటిడి ఛైర్మన్‌గా నియమితులవుతారని ప్రచారం జరిగినా...ఆయన క్రైస్తవ మత ప్రచార సభలకు వెళ్లారని అభ్యంతరం రావడంతో...అప్పట్లో... ఆయన నియామకానికి బ్రేక్‌ వేశారు సిఎం చంద్రబాబునాయుడు. తరువాత 'పుట్టా సుధాకర్‌యాదవ్‌' ను అడిగి అసలు విషయం తెలుసుకున్నారు. ఆయన సభలకు వెళ్లిన మాట నిజమేనని..అయితే... తాను హిందువునని...క్రైస్తవ సభలకు పిలిస్తే...రాజకీయ నాయకునిహోదాలో వెళ్లానని ఆయన వివరించారు. దీంతో...హిందూ ధార్మిక సంస్థలు అభ్యంతరం తెలిపినా...'చంద్రబాబు' వారి ఒత్తిడిలకు తలొగ్గక...ఆయననే టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు. ఆయనతో పాటు..వివిధ సంస్థలకు ఛైర్మన్లు నియమించారు. 


గతంలో వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్‌గా ఉన్నవారిలో ఇద్దరిని మాత్రమే కొనసాగిస్తూ...మరో ఐదుగురు కొత్త వారికి అవకాశం కల్పించారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేసిన 'జూపూడి ప్రభాకర్‌రావు'కు మళ్లీ అదే పదవి ఇస్తూ...ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పనిచేసే నాయకునిగా...ఎస్సీల్లో నోరున్న నేతగా పేరున్న 'జూపూడి ప్రభాకర్‌రావు'ను తిరిగి..అదే సంస్థకు ఛైర్మన్‌గా నియమిస్తూ..పనిచేసే వారిని ప్రోత్సహిస్తానని 'చంద్రబాబు' మరోసారి రుజవు చేశారు. కాగా..గతంలో ఛైర్మన్‌గా పనిచేసిన 'వర్ల రామయ్య'ను ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించారు. ఇటీవల ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరగడం..ఆఖరి వరకు రేసులో ఉండడంతో...ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని ఇచ్చి...గౌరవించారని తెలుస్తోంది. కాగా...మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డికి ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాజీ మంత్రి  కొత్తపల్లి సుబ్బారాయుడును నియమించారు. మైనార్టీ కమీషన్‌ ఛైర్మన్‌గా జియాఉద్దీన్‌ను, మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హిదయత్‌ను చంద్రబాబు నియమించారు. మొత్తం మీద గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న కార్పొరేషన్‌ ఛైర్మన్ల పదవులను సిఎం భర్తీ చేయటం పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.


(441)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ