WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అక్టోబర్‌2 నాటికి ఓడిఎఫ్‌ ప్లస్‌ జిల్లాగా కృష్ణా....!

రానున్న అక్టోబర్‌2నాటికి కృష్ణా జిల్లాను ఓడిఎఫ్‌ ప్లస్‌ జిల్లాగా ప్రకటించడమే తన ధ్యేయమని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత ప్రాంతంగా(ఓడీఎఫ్‌)గా ప్రకటించి జిల్లాను స్వచ్చకృష్ణాగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వివరించారు. గుజరాత్‌లోని చంపారన్‌ నుంచి దేశవ్యాప్తంగా 20జిల్లాల్లో స్వత్యాగ్రహసే స్వచ్ఛగ్రహ్‌ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 16 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను ప్రధాని నరేంద్ర మోడీతో పంచుకున్నారు. రాష్ట్రంలో కృష్ణా జిల్లా దీనికి ఎంపికైంది. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ లక్ష్మీకాంతం నేరుగా ప్రధానితో మాట్లాడుతూ..వచ్చే అక్టోబర్‌ 2 నాటికి జిల్లాను ఓడిఎఫ్‌ ప్లస్‌ జిల్లాగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 21రోజుల పాటు ఆత్మగౌర దీక్ష నిర్వహించామని...'చెంబు చచ్చింది-ఆత్మగౌరం బతికింది' నినాదంతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవగాహన ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించుకుంటామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించినట్లు  తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీలలో కమ్యూనిటీ మరుగుదొడ్లను నిర్మించామని చెప్పారు. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి వాటిని నూరుశాతం సద్వినియోగం చేసుకునే విధంగా వారిలో చైతన్యం కల్గిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రధానికి వివరించారు. (కలెక్టర్‌ లక్ష్మీకాంతం ప్రసంగం కోసం...https://www.youtube.com/embed/EIcDAJ21aiYఇక్కడ క్లిక్‌ చేయండి)


(119)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ