WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పట్టిసీమ'పై సీబీఐ విచారణ జరిపిస్తారా...!?

తమను ధిక్కరించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఏ విధంగా కక్ష తీర్చుకోవాలనే దానిపై బిజెపి పెద్దలు..రకరకాలైన మార్గాలు వెతుకుతున్నారట. తమ ప్రభుత్వంపై, రాష్ట్రంపై, పార్టీపై బిజెపి కన్నువేసిందని..ఏ క్షణమైనా...దాడి జరగవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు బహిరంగంగానే చెప్పారు. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ...పార్టీ నాయకులతో జరుగుతున్న చర్చల సందర్భంగానూ..ఆయన ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నారు. తనపై నేరుగా దాడి చేయకపోవచ్చునని..కానీ తన కుమారుడు కానీ...ఇతర మంత్రులు కానీ...సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులపై కానీ...కేసులు పెట్టవచ్చుననేది ముఖ్యమంత్రి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అయితే...సంక్షేమ కార్యక్రమాల్లో జరిగిన అవినీతి కానీ...అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన పనుల్లో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చునని..ఆయన అభిప్రాయంగా ఉంది. వీటిలో భారీస్థాయిలో నిర్మించిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై కేంద్రం విచారణ చేయించవచ్చుననేది..ముఖ్యమంత్రి అనుమానం.

  ముఖ్యంగా...కృష్ణా,గుంటూరు జిల్లాలకు మేలు చేకూర్చిన 'పట్టిసీమ' ప్రాజెక్టుపై విచారణ చేయించ వచ్చుననేది...ముఖ్యమంత్రి...ఇతర మంత్రుల అనుమానం. ఇటీవల కాలంలో బిజెపి నేతలు...ఈ విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. బిజెపి శాసనసభాపక్షనాయకుడు 'విష్ణుకుమార్‌రాజు' పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించి..దీనిలో అవినీతి జరిగిందని..దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు. గతంలో ఈ ప్రాజెక్టును ప్రశంసించిన...'విష్ణుకుమార్‌రాజు' మారిన రాజకీయ పరిస్థితుల్లో..వైకాపా నాయకుల వలే ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదంతా కోర్టులో కేసు వేయడానికి పూర్వరంగాన్ని సిద్ధం చేయడానికేనన్న అనుమానం టిడిపి వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో ఏదైనా అవినీతి కానీ...అక్రమాలపై కానీ...లేక..ఇంకేదైనా...విషయంపైన అయినా...సీబీఐ విచారణ జరగాలంటే...రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐ విచారణ కావాలని కోరాలి. అటువంటప్పుడు మాత్రమే సీబీఐ రంగంలోకి దిగుతుంది. లేదంటే న్యాయస్థానాలు ఆదేశిస్తేనే...సీబీఐ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై సీబీఐ విచారణ కోరదు. అందుకే...బిజెపి పెద్దలు...న్యాయస్థానాల ద్వారా...సీబీఐను రంగంలోకి దింపి...'చంద్రబాబు' అంతు చూడాలని వ్యూహం పన్నింది. అందుకే...ఆ ప్రాజెక్టుపై పదే పదే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది. పట్టిసీమ వల్ల రైతులకు మేలు జరిగింది కదా..? అని బిజెపి నేతలను ప్రశ్నిస్తే...మేలు జరిగితే...అవినీతిని వదిలేయాలా..? అని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

కాంట్రాక్టర్‌పై ఒత్తిడి...!

కాగా..ఈ విషయంలో పట్టిసీమ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌పై కూడా వారు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. కాంట్రాక్టర్‌ను ఇప్పటికే...ఢిల్లీకి పిలిపించారని జోరుగా ప్రచారం జరుగుతుండగా...కాంట్రాక్టు సంస్థ అవన్నీ అసత్యాలని కొట్టిపారేస్తోంది. తమ కాంట్రాక్టర్‌ వివిధ పనులపై ఢిల్లీకి వెళ్లి వస్తుంటారని..ఢిల్లీ వెళితే...బిజెపి పెద్దలను కలసినట్లు కాదని..ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే...ఈ విషయంపై టిడిపి వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తనను టిడిపి పెద్దలు అనుమానిస్తున్నారని తెలుసుకున్న కాంట్రాక్టర్‌ ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి వివరణ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తం మీద ఒక వైపు సీబీఐ విచారణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాలని..భావిస్తూనే...ప్రాజెక్టును నిర్మించిన కాంట్రాక్టర్‌ను అప్రూవర్‌గా మార్చాలనే వ్యూహం బిజెపి పెద్దల్లో ఉందని..సమాచారం. ఏది ఏమైనా...ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కానీ..మరేదైనా జరగాలంటే...కర్ణాటక ఎన్నికల వరకు ఆగాల్సిందేనని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరేం జరుగుతుందో వేచి చూద్దాం..!


(212)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ