WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పుట్టా' నియామకంపై 'హిందూ' సంస్థల ఆగ్రహం...!

టీటీడీ ఛైర్మన్‌గా 'పుట్టా సుధాకర్‌యాదవ్‌'ను నియమించడాన్ని హిందూ మతాభిమానులు, పీఠాతిపతులు, బిజెపి నాయకులు తప్పుపడుతూ...విమర్శలు కురిపిస్తున్నారు. బుధవారం నాడు వివిధ టీవీ ఛానెల్స్‌లో బిజెపి నాయకులు మాట్లాడుతూ..దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'పుట్టా' క్రైస్తవ మతస్తుడు కాదని, క్రైస్తవ ప్రచార సభలకువెళ్లిన మాట యధార్థమేనని, కానీ...ఆయన క్రైస్తవ మద్దతుదారుడిగా..ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారని...ఇంటిలిజెన్స్‌ ఇచ్చిన నివేదికను ఆరు నెలల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పెట్టారు. అప్పట్లో...క్రైస్తవ ప్రచారసభలకు 'సుధాకర్‌యాదవ్‌' వెళ్లినప్పుడు బహిరంగ వేదికపై క్రైస్తవ మత ప్రచారకులు మాట్లాడుతూ..'పుట్టా'కు హిందూమతం కన్నా..క్రైస్తవ మతంపైనే అభిమానం ఎక్కువని వ్యాఖ్యానించినప్పుడు...దానిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం వివాదానికి దారి తీసింది. ఇప్పటికీ...సుధాకర్‌యాదవ్‌ క్రైస్తవ మతస్తుడనే ప్రచారం జరుగుతోంది. వివాదాస్పదమైన 'సుధాకర్‌యాదవ్‌'నే ఎందుకు చంద్రబాబు నియమించారనే దానిపై పలు కథనాలు ప్రచారంలోకి ఉన్నాయి.

  కాగా సుధాకర్‌యాదవ్‌కు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇవ్వడంపై..బిజెపి సంస్థలు, ఇతరులు ఆందోళనలోకి దిగనున్నాయి. 'పుట్టా'ను క్రైస్తవుడిగా ముద్రవేసింది బిజెపి నేతలే. ప్రజల్లోకి ఎలా తీసుకెళతారో.. ప్రజలు దీన్ని ఎంత వరకు నమ్ముతారో..వేచి చూడాల్సిందే. వాస్తవానికి హిందూ ధార్మిక సంస్థలో ఎటువంటి పదవులైనా...ఉద్యోగమైనా చేయాలంటే...ఆ మతంపై నమ్మకం ఉండాలి..సాంప్రదాయాలను పాటించాలనే నియమనిబంధనలు ఉన్నాయి. ఆ నియమనిబంధనలతోనే...టీటీడీలో పనిచేస్తోన్న అన్యమతస్తులను తొలగించాలని అధికారులు నిర్ణయించుకోవడం వారు కోర్టుకు వెళ్లడం..తదుపరి తీర్పు ఇచ్చేవరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కానీ...అన్య మతస్తులు..హిందూ ధర్మసంస్థల్లో పనిచేయటం సరికాదని..కోర్టు అంగీకరిస్తూ..ఇన్ని సంవత్సరాలు... ఉద్యోగం చేసిన వారిని తీసివేయడం సరికాదని వ్యాఖ్యానించింది. హిందూ మతంపై,భగవంతుడిపై నమ్మకం లేని వారు..ఈ సంస్థలో ఎలా పనిచేస్తారని...కోర్టు వ్యాఖ్యానిస్తూ...ఇది ఏ మతానికైనా సరికాదని వ్యాఖ్యానించింది. అటువంటినేపథ్యంలో 'సుధాకర్‌యాదవ్‌'ను నియమించవద్దని సిఫార్సు చేసినప్పటికీ...రాజయకీయవర్గమైన అవసరాల కోసం 'సుధాకర్‌'నునియమించారని టిడిపి నాయకులు చెబుతున్నారు.

(246)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ