WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆళ్ల'కు దిమ్మతిరిగింది...!

మంగళగిరి ఎమ్మెల్యే 'ఆళ్ల రామకృష్ణారెడ్డి'కి దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తోందట. పాదయాత్ర చేస్తోన్న వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ను తన నియోజకవర్గంలోకి అట్టహాసంగా ఆహ్వానించి...తన సత్తా చూపిద్దామనుకున్న 'ఆళ్ల'కు నియోజకవర్గ ప్రజలు షాక్‌ ఇచ్చారు. గుంటూరు,నర్సరావుపేట, సత్తెనపల్లి,చిలకలూరిపేట తదితర నియోజకవర్గాల్లో 'జగన్‌' యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదే ఊపు 'మంగళగిరి'లో ఉంటుందని భావించిన 'జగన్‌'కు, ఆళ్లకు..నియోజకవర్గ ప్రజల స్పందనతో మైండ్‌బ్లాంక్‌ అయింది. రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో...'జగన్‌' పర్యటనకు ప్రజలు తండోపతండాలుగా వస్తారని భావించిన వారికి పదుల సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి మూర్చపోయినంత పనైంది. ఎందుకు ఇక్కడ ప్రజలు 'జగన్‌'ను పట్టించుకోలేదన్న ప్రశ్న..పార్టీ వర్గాలను కుదిపేస్తోంది. 

  పాదయాత్ర సన్నాహాల్లో భాగంగా...నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కలియతిరిగారు. అంతే కాకుండా పాదయాత్ర ఎప్పుడు జరుగుతుంది...అన్న దానిపై కూడా ప్రచారం చేశారు. భారీగా ఖర్చుపెట్టి స్థానిక నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయినా...'జనం'లో మాత్రం స్పందన కనిపించలేదు. 'జగన్‌' సెక్యూరిటీ...సొంత మనుషులు తప్ప...మరెవరూ...ఆ పాదయాత్రలో కనిపించకపోవడంతో...'జగన్‌' షాక్‌కు గురై...'ఆళ్ల'తో మాట్లాడలేదట. ఇదేమిటి...? ఆళ్ల ఇలా చేశాడు...ఆయనను నమ్ముకుంటే...ఇంతే సంగతులు..అన్నట్లు..వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి...అన్యాపదేశంగా 'జగన్‌' మాట్లాడాడట. దీంతో..'ఆళ్ల'లో వణుకుమొదలైందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత చెప్పినట్లా..చేశానని..ప్రభుత్వంపై కేసులు వేయమంటే.. వేశానని...రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోమంటే...అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశానని...'జగన్‌' ఏది చెబితే..అది చేసిన..తనను అధినేత చిన్నచూపు చూడడంపై...'ఆళ్ల' మనస్థాపానికి గురయ్యారట. మొత్తం మీద...రాజధాని ప్రాంతంలో 'జగన్‌' పాదయాత్ర అట్టర్‌ప్లాప్‌ కావడంతో..వైకాపా శ్రేణులు దిగాలు చెందుతున్నాయి.


(1043)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ