లేటెస్ట్

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా 'శ్రీనాథ్‌రెడ్డి' నియామకం

 రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయనను ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుధీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేసిన శ్రీనాథ్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన వారు. ఆయన ఆంధ్రప్రభ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో వివిధ హోదాల్లోపనిచేశారు. ఉమ్మడి ఏపీయుడబ్ల్యూజెలో ఆయన కీలకంగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి జె.సి.దివాకర్‌రెడ్డిలతో కలసి సీమ సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు. సీమ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన రాయలసీమవాసులకు సుపరిచితులు. కడప జిల్లా లోని పులివెందుల మండలం కోరగుంటపల్లె ఆయన స్వస్థలం.

(349)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ