WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కీచక ఎఇకి మద్దుతు ఇస్తోన్న ఉన్నతాధికారులు...!

రాజీకి మహిళా ఉద్యోగిపై ఒత్తిడి...!

కర్నూలు ఏప్రిల్ 12 (జనం ప్రతినిధి) : క్రిందిస్థాయి మహిళా ఉద్యోగిని లైంగికవేదించిన విషయం బయటకు పొక్కటంతో సదరు ఏఈ ని సహోద్యోగులు ఆపైస్థాయి అధికారులు రక్షించేందుకు విశ్వప్రత్నాలు చేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం గృహనిర్మాణ శాఖలో పని చేస్తున్న ఏఈ అదే శాఖలో అదే మండలానికి కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల విషయం  తెలిసిందే. ఈ విషయం జిల్లా అధికారులకు తెలియడంతో  సదరు ఏఈని ఎలాగైనా కేసునుండి బయట పడేయాలనే ఉద్దేశంతో  అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బాధిత ఉద్యోగిని జిల్లా కార్యాలయానికి పిలిపించి సదరు ఏఈ కి అనుకూలంగా వుండే విధంగా వ్రాత పూర్వకంగా లెటర్ ఇవ్వాలని తనపై వత్తిడి చేశారు. అయితే అ ఉద్యోగిని అందుకు ససేమిరా అనటంతో కథ అడ్డంతిరిగింది దీంతో మరోకోణంలో ఏఈని రక్షించే  ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదేని కేసులో తమ పైఅధికారిపై క్రిందిస్థాయి ఉద్యోగులు పిర్యాదు చేస్తే సంఘటనా స్థలంలో అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఈ కేసులో బాధిత ఉద్యోగిని కర్నూలుకు పిలిపించి ఏఈ కి అనుగుణంగా లెటర్ వ్రాయించే ప్రయత్నం చేశారంటే  ఆ ఉద్యోగి వెనక ఎంతమంది ఆడిరికారులు ఆయనకు అనుకూలంగా పైరవీలు చేస్తున్నారో అర్థం అవుతోంది ఈ సంఘటనలో బాధిత ఉద్యోగినికి. న్యాయం జరగని పక్షంలో ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోల్లో అభద్రతాభావం నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారు న్యాయానికి అండగా నిలిచి బాధిత మహిళకు న్యాయం చేకూర్చాలని లేని పక్షంలో మహిళా ఉద్యోగుల నిరసన ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ