WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పౌరసరఫరాలశాఖలో వందకోట్ల అవినీతి....!?

పౌరసరఫరాల సంస్థలో సుమారు వందకోట్ల రూపాయలు చేతులు మారాయని దీనిపై పూర్తి విచారణ జరిపితే...అంత కన్నా రెట్టింపు నిధులు చేతులు మారి ఉంటాయని కొంత మంది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయటం జరిగింది. ఆ విషయం 'చంద్రబాబు' దృష్టికి వచ్చిందో లేదో..కానీ..దానిపై అప్పట్లో..ఎటువంటి విచారణ జరగలేదు. సిఎం కార్యాలయ అధికారి ఈ ఫిర్యాదును మాయం చేసి ఉంటారని కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. అసలు విషయానికి వెళితే...ఈ సంస్థలో మూడేళ్లకు పైగా ఎండిగా బాధ్యతలు నిర్వహించిన 'రామ్‌గోపాల్‌'పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన పనితీరుపై పలు విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయం ఏ విధంగానూ స్పందించలేదు. ఎవరు చెప్పారో...ఎలా చెప్పారో.. తెలియదు కానీ...సిఎం దృష్టికి ఈ విషయం రావడంతో..'రామ్‌గోపాల్‌'ను తప్పించడం జరిగింది. అంతే కాకుండా ఏసీబీ విచారణకు ఆదేశించినట్లు బయటకు పొక్కింది. ఇంతకీ లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేశారా..? లేక వందకోట్ల దుర్వినియోగంపై విచారణ చేస్తున్నారా..? అనేది బయటకు పొక్కడం లేదు. రాంగోపాల్‌ హయాంలో అవినీతి జరిగిన మాట యధార్థమేనని..ఆయనను బదిలీ చేయాలని మంత్రి పత్తిపాటి పుల్లారావు సిఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినా...అక్కడ చర్యలు తీసుకోక పోవడంతో...ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిసింది. అయినప్పటికీ..రాంగోపాల్‌ యధావిధిగా అదే పోస్టులో కొనసాగుతున్నారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో...ఆయన ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. తాజాగా ఈ సంస్థ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'సూర్యకుమారి' గతంలో జరిగిన అవకతవకలను బయటకు తీయనున్నట్లు తెలిసింది. కానీ...ఆమె ఈవిషయంపై నోరు మెదపకుండా...తన పని తాను చేసుకుంటున్నారు. నాలుగేళ్లలో వందకోట్లే కాదు..ఇంకా ఎక్కువే చేతులు మారినట్లు ఆ శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. 

  ఈ సంస్థలో అవినీతి ఎంత జరిగిందనే దానిపై ఏసీబీ విచారణ జరిపితే..అసలు దోషులు బయటపడతారు. రాంగోపాల్‌ ఒక్కరే అవినీతికి పాల్పడ్డారా..? సిఎంఒ అధికారుల మద్దతు ఆయనకు ఉందా..? మిగతా..అధికారులు కూడా దీనికి బాధ్యులా..అనేవిషయంపై విచారణ జరిపితే... వెలుగులోకి రాలేని..విషయాలు బయట పడతాయి. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని... కష్టపడి పనిచేశానని...ఇదంతా తనంటే గిట్టనివారు చేస్తోన్న ప్రచారమని...'రాంగోపాల్‌' మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ 'రాంగోపాల్‌' చెప్పిందే..నిజం అనుకుంటే... మంత్రి పుల్లారావు ఆ సంస్థ అవినీతిపై విచారణ జరిపించాలని..ఎందుకు లెటర్‌ రాస్తారు..? రాంగోపాల్‌ను పదవి నుంచి తప్పించాలని ఎందుకు కోరతారు? సిఎంఒలో ఆయనకు అండగా నిలిచిన అధికారి ఎవరు...? ఈ మొత్తం విషయాలపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారనే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన ఘర్షణ వల్ల...ఈవిషయాన్ని ఆయన పట్టించుకోకపోవడం..పౌరసరఫరాలశాఖ అధికారులకు కలసి వచ్చింది. కానీ...అవినీతికి పాల్పడిన అధికారులెవరినీ వదిలేది లేదని ప్రస్తుత అధికారులు చెబుతున్నారు. మొన్నటి దాకా...ఈ విషయంపై విచారణ జరిపించాలని పట్టుపట్టిన మంత్రి పుల్లారావు...ఈ విషయంపై ఇప్పుడు పెద్దగా మాట్లాడడం లేదు. 

  రాంగోపాల్‌ను తప్పించారు కాబట్టి...ఇంకెందుకులే...అని ఆయన నోరు మెదపడం లేదా..? లేక సిఎంఒ అధికారి...ఆయనపై ఒత్తిడి తెచ్చారా..? అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఏది ఏమైనా...పౌరసరఫరాలశాఖలో అవినీతి,అక్రమాలు జరిగాయనేది యధార్థం. అంతే కాకుండా గోడౌన్‌లు నిర్మించడంలో ఒక అధికారికి భాగస్వామ్యం ఉందని..లక్ష మెట్రిక్‌ల సామర్ధ్యం కల గోడౌన్‌లు నిర్మించడంలో అవినీతి జరిగిందని..దీనిపై కూడా విచారణ జరిపిస్తే...ఈ విషయంలో ఉన్న అసలు దోషి ఎవరో బయటకు వస్తారని...ఉద్యోగులు చెబుతున్నారు. బాధ్యతగా ఉండాల్సిన ఉన్నతాధికారులు అవినీతి జరుగుతున్నా...మౌనంగా ఉన్నారని...తమ చేతికి మట్టి అంటకుండా... వాటాలు పంచుకున్నారని  తెలుస్తోంది. తాజాగా అసలు విషయం బయట పడడంతో...అవినీతిపై ఎందుకు మౌనంగా ఉన్నారని...ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే...గతంలో తాము ఎవరెవరి దృష్టికి తీసుకెళ్లాల్లో వారి దృష్టికి తీసుకెళ్లామని..దీనిపై సిఎంఒ అధికారులు దృష్టి పెట్టలేదని..అందుకే తాము మౌనంగా ఉన్నామని చెబుతున్నారు. ఏది ఏమైనా...పౌరసరఫరాలశాఖలో విచారణ జరిపిస్తే...అసలు విషయాలన్నీ బయటకు వస్తాయని ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు.

(293)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ