WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పగలేమో..ప్రత్యర్థులు...రాత్రి అయితే...సన్నిహితులు...!

మంత్రి సోమిరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డిలు మిలాఖత్‌...!

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 'చంద్రబాబు'పై వాడివేడి ఆరోపణలు, విమర్శలు చేశారు..ఇంకా చేస్తూనే ఉన్నారు. శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలకు, విమర్శలకు స్పందించాల్సిన మంత్రి సోమిరెడ్డి వైకాపా నేత...'జగన్‌'పై విమర్శలు చేసి చేతులు దులుపుకుంటున్నారని స్వపక్షనేతలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా 'కోటంరెడ్డి' తమ నేత..జగన్‌పై సోమిరెడ్డి విమర్శలను తిప్పికొట్టడం లేదు. విచిత్రమేమిటంటే...అప్పుడప్పుడు..పగటిపూట...శ్రీధర్‌రెడ్డి,సోమిరెడ్డి పరస్పరం తిట్టుకుంటారని... సమీక్షా సమావేశాల్లో సవాళ్లు విసురుకుంటారని..కానీ...రాత్రి అయిన తరువాత..ఇద్దరు పరస్పరం ఫోన్‌లో మాట్లాడుకుంటారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 

  ఇందులో ఎంత వరకు నిజం ఉందో..లేదో కానీ...'కోటంరెడ్డి' చేసిన సిఫార్సులను..అధికారులు ఆగమేఘాలపై చేయటం వెనుక మంత్రి హస్తం ఉందని జిల్లా టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు మీడియాతో మాట్లాడుతూ..ఈ విషయాన్ని 'జగన్‌' దృష్టికి తీసుకెళతామని చెప్పారు. మరి 'సోమిరెడ్డి' వ్యవహారాన్ని 'చంద్రబాబు' దృష్టికి తీసుకెళ్లేదెవరు..? ఒక వేళ 'చంద్రబాబు' దృష్టికి తీసుకెళ్లినా స్పందిస్తారా..? అనే అనుమానం ఉందని టిడిపి నాయకులు చెబుతున్నారు. బీదరవిచంద్రయాదవ్‌ లౌక్యంతో వ్యవహరిస్తూ...మంత్రి సోమిరెడ్డితో...మరో మంత్రి నారాయణతో అనేక పనులు చక్కపెట్టుకుంటూ...ఆర్థికంగా దూసుకుపోతున్నారని టిడిపి నాయకులే చెబుతున్నారు. ఏది ఏమైనా..నెల్లూరు జిల్లాలో అవినీతి..పెరిగిపోయిందని..దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టుకట్టవేయకుంటే...2004 ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. అప్పట్లో...సోమిరెడ్డి మంత్రిగా ఉండి సింగిల్‌ సీటు కూడా గెలిపించలేకపోయారు.

(578)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ