WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గుంటూరులో వైకాపా గెల్చేది మూడే సీట్లట...!?

ఆరు నెలలు సాము చేసి..మూలనున్న ముసలమ్మని కొట్టినట్లుందట..వైకాపా తాజా రాజకీయ పరిస్థితి. పార్టీకి పట్టు పెంచాలని...వచ్చే ఎన్నికల్లో గెలిచి సిఎం అవ్వాలని...కఠిన పాదయాత్ర చేస్తోన్న 'జగన్‌'కు...ఆరు జిల్లాలు తిరిగినా...ఇంకా పట్టుదొరకడం లేదట. తాను పాదయాత్ర చేసిన చోట పార్టీ పరిస్థితి ఏలా ఉందని సర్వే చేయించుకుంటే దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయట. స్వంత ప్రాంతమైన రాయలసీమలో కూడా పార్టీ గ్రాఫ్‌ ఏమీ పెరగలేదట. గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేమని స్వంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. పాదయాత్రతో గ్రాఫ్‌ పెరిగిందని...ఇక కాబోయే సిఎం 'జగనే'నని ఊదరగొట్టినా..ప్రజలు ఒక స్పష్టతతో ఉన్నారట. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న 'జగన్‌'కు ఒకటి రెండు నియోజకవర్గాల్లో ప్రజల నుండి వచ్చిన స్పందన చూసి..ఒకటే సంబరపడిపోయారట. జిఎస్‌టి...కెఎస్‌టి...అంటూ...డైలాగ్‌లు కొడితే...ఆ డైలాగ్‌లకు ప్రజల నుంచి స్పందన రావడంతో...ఇంకేముంది..జిల్లా మొత్తం స్వీప్‌ చేస్తామని ఒకటే ఆనందపడిపోయారట... 'జగన్‌' అండ్‌ అదర్స్‌...! కానీ...నర్సరావుపేట, సత్తెనపల్లి...ఆనందం 'జగన్‌'కు ఎంతో సేపు మిగలలేదు. గుంటూరులో ఓ మోస్తరుగా జరిగిన పాదయాత్ర 'మంగళగిరి'కి వచ్చేసరి తుస్సమంది. 

  ఇదేమిటి..? అక్కడ..ఆ విధంగా ఉంటే...ఇక్కడెందుకు ఇలా ఉందని...'జగన్‌' ఒకటే ఇదై...అర్జెంట్‌గా సర్వే చేయించమన్నారట. తాను తిరిగిన ప్రాంతాలతో పాటు..ఇతర నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తే...'జగన్‌'కు మైండ్‌ తిరిగే ఫలితాలు వచ్చాయని స్వంత పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. మొత్తం రాష్ట్ర పరిస్థితిని పక్కన పెడితే..రాజకీయ చైతన్యం కలిగిన 'గుంటూరు' జిల్లాలో కేవలం మూడు సీట్లు మాత్రమే వస్తాయని తేలిందట. మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్న గుంటూరులో మూడు సీట్లు వస్తాయంటే...తన పాదయాత్ర ప్రభావం ఏమిటో...అర్థం కాక...'జగన్‌' కళ్లు తేలవేశాడని...పార్టీ నాయకులు అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. అయితే...జిల్లాలో ఉన్న 17 స్థానాల్లో వచ్చే మూడేమిటని...వైకాపా నాయకులు లెక్కలు వేసుకుంటున్నారట...జిఎస్‌టి.. కెసిఎస్‌టి దగ్గర ఒకటి వస్తుందని లెక్కలు వేశారట....మరో రెండు ఏమిటని..ప్రశ్నిస్తే...ఎవరూ సమాధానం చెప్పడం లేదట...? మొత్తం మీద...మూడు వస్తాయని చెప్పుకుని సర్దుకుపోతున్నారట.


(517)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ