WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్లతో...నేరుగా...'మోడీ' పాలన చేస్తాడట...!

నిన్న కృష్ణా జిల్లా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం'తో..ప్రధాని నరేంద్రమోడీ..ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా...! గుజరాత్‌లోని చంపారన్‌ వద్ద నుంచి దాదాపు దేశ వ్యాప్తంగా 20 జిల్లాల కలెక్టర్లతో..ప్రధాని మోడీ 'సత్యాగ్రహసే...స్వచ్చగ్రహ్‌' అని స్వచ్ఛభారత్‌పై కార్యక్రమం నిర్వహించి... కలెక్టర్‌ లక్ష్మీకాంతంతో నేరుగా మాట్లాడారు. బహిరంగ మల,మూత్ర విస్తర్జనపై కృష్ణా జిల్లా ఎటువంటి ప్రగతి సాధించింది...దానిలో కలెక్టర్‌ వివరించారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించినా...ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాను ఎన్నుకోవడంలో బిజెపి పెద్దల వ్యూహం ఒకటి ఉందట. కేంద్రంతో టిడిపి తెగతెంపులు చేసుకున్న తరువాత...ఇక రాష్ట్రంలో స్వంతంగా బలపడాలనే ఉద్దేశ్యంతో...నేరుగా రాష్ట్రంలో తానే పాలన చేస్తానని బిజెపి నాయకులకు 'మోడీ' చెప్పారట. 

   కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇక నుంచి నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోడీ సంభాషించబోతున్నారట. ఆ పథకాలు ఎంత వరకు వచ్చాయి...? నిధుల కొరత, ఇతర సమస్యలను ప్రస్తావించి...ప్రజలను ఆకట్టుకోవాలని భావిస్తున్నారట. దీని ద్వారా కేంద్రం ఎన్ని అధ్భుత పథకాలను ప్రవేశపెట్టిందో ప్రజలకు వివరించడం వారి ధ్యేయమట. అదే సమయంలో వివిధ జిల్లాలో రాజకీయ సమీకరణలు ఎలా ఉన్నాయి...? రాష్ట్ర రాజకీయాలను  ప్రభావితం చేసే అంశాలు ఏమిటి..? దీనిపై ఎలా వ్యవహరించాలి...అనే అంశాలను కూడా కలెక్టర్లతో చర్చిస్తారని..తద్వారా...రాష్ట్రంలో బిజెపిని బలోపేతమైన శక్తిగా తీర్చిదిద్దాలని వ్యూహం పన్నారట. ప్రధాని 'మోడీ' నేరుగా రాష్ట్ర కలెక్టర్లతో సంభాషించి...ఆదేశాలు...ఇస్తుంటే...మరి రాష్ట్రముఖ్యమంత్రి ఏం చేయాలనే..దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తం మీద సాఫీగా సాగిపోయే పాలనను కూడా..సాగనివ్వకుండాలనే ఉద్దేశ్యంతోనే...'మోడీ' ఈ రకమైన ప్రయోగాలు చేస్తున్నారని....'మోడీ' చేసిన మోసాన్ని తెలుగు ప్రజలు ఎవ్వరూ మరచిపోరని...'మోడీ' ఆటలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవని టిడిపి నాయకులు చెబుతున్నారు.


(337)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ