WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నేరాలను అరికట్టేందుకు...నూతన సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు:సిఎం

రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీస్ వ్యవస్డలో నూతన సాంకేతిక విధానాన్ని అమలుచేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం డి.జి.పి. కార్యాలయపు ఆవరణలో రూ.18 కోట్లతో నిర్మించిన ‘టెక్ టవర్’ ను ఆయన లాంచనంగా ప్రారంభించారు.  సుమారు 64 వేల చదరపు అడుగులలో ఆరు అంతస్తులలో టెక్ టవర్ ను నిర్మించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, సాంకేతిక సర్వీసెస్, ఫోరెన్సిక్ ల్యాబ్, రవాణా వ్యవస్ద, నియామకం, గృహ నిర్మాణం తదితర సేవలు ప్రస్తుత టవర్ నుండి పనిచేస్తాయని చెప్పారు. భవిష్యత్తులో పోలీస్ వ్యవస్డలో అన్ని విభాగాలలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. నేరస్తులు సమర్ద సాంకేతిక వ్యవస్డను అమలు చేస్తున్నారని, అంతకంటే ధీటుగా పోలీస్ వ్యవస్డను రూపొందించనున్నట్లు తెలిపారు. 

   నూతన సాంకేతిక వ్యవస్డలో తక్కువ సమయంలో నేరారోపణ రుజువయ్యే అవకాశం ఉందన్నారు. నేరాలు గణనీయంగా తగ్గించడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, వాటి నియంత్రణ, పోలీస్ వ్యవస్ద తీసుకున్న చర్యల పై ప్రతి నెలా ఒక బులెటిన్ ను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణపై ప్రజలలో చర్చ జరగాలన్నారు. పోలీస్ వ్యవస్ద మరింత పటిష్టవంతంగా పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. సైబర్ సెక్యూరిటీతో పోలీస్ వ్యవస్థను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. సమర్దవంతంగా పనిచేసే యువతను పోలీస్ విభాగంలోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా 2017 సంవత్సరంలో జరిగిన నేరాలు, వాటి నియంత్రణలపై రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్ కోన శశిధర్,  డి.జి.పి. మాల కొండయ్య, ఇతర విభాగాలకు చెందినా పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

(99)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ